Others

ఆత్మ... జీవాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవెవరు? నేనెవరు?
నీవు అంతులేని కృపాసముద్రము
నే పిల్లకాల్వ పగిది సంకుచితం
నీవు గుణ రహితుడవు, నేను గుణ సహితుడను
నీవు శిల్పి, నేను ‘శిలిపి’- ‘శిలి’
నీది హేల, నాకదే పెద్దగోల
నీవు సంపూర్ణం నేను అసంపూర్ణం
నీవు కర్త నేను కర్మ , క్రియ
నీవు అణుసూక్ష్మం నేను అతిస్థూలం
నీవు యోగి నేను భోగి
నీవు కడలి నేను ఆగని కెరటం
నీవు అగ్ని మండలం నేనందలి రవ్వను
నే క్రియను నీవు నిష్క్రియవు
నీవు నింగి, నేను నేల
నీవుఋతం నేను అనృతం
నీవు తపస్సు నేను తమస్సు
నీవు ‘ఓంకారం’ నేను అహంకారం
నీలో నేనున్నానంటావు,
నాగుండెల్లోను నీవున్నానంటావా!!
నేను లేకున్నా నీవు ఉంటూనే ఉంటావు
కానీ నాకు కనిపించవు, వినిపించవు
వేదనే వేదంగా, ధారణే ధ్యానంగా
నీ నామస్మరణే సాధనగా ఆర్తితో అర్థిస్తున్నా
నీవు కనులారా కనిపించు వీనులారా వినిపించు
నాకు గజేంద్రుని శక్తి లేదు, మకరమునకున్న పట్టులేదు
ప్రహ్లాదుని పారవశ్యం మంతకన్నా లేదు ధ్రువుని దీక్షా లేదు
నాతమకమే చమకమనుకో నాగమనమే నమకమనుకో
నీవు కొందరి సొత్తువు కాదని,
అందరివాడవూ నీవనీ తెలిసీ వేడుకొంటున్నా..
నాకూ నీ తత్వం ఎరుకపర్చు
నీకివే నమస్సులు తమస్సులు పోగొట్టి
వెలుగులు పరుచు స్వామీ

కె. రఘునాథ్ 9912190466