Others

ఇక.. పాలనపై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరంలో మొదటి అయిదు నెలలూ ఎన్నికల వాతావరణంతో కోలాహలం కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికలతో పాలన అటకెక్కి కేవలం రాజకీయాలపైనే పాలకులు దృష్టి కేంద్రీకరించారు. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే అయినప్పటికీ, ఇప్పుడు జనమంతా తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏదో మేలు చేస్తారని ఆశించడం సహజం.
ఇప్పుడు కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుతీరనుంది. ఎన్నో సమస్యలు ప్రజానీకాన్ని చిరకాలంగా వెంటాడుతున్నాయి. దశాబ్దాల తరబడి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలవబడుతోంది. అభివృద్ధి చెందిన దేశంగా పరిగణింపబడాలంటే ఇంకా ఎనే్నళ్ళు వేచిచూడాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఏదైతేనేమి ఇప్పుడు కేంద్రంలో కొలువుతీరనున్న ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లున్నాయి. అతి ముఖ్యంగా నిరుద్యోగ సమస్య యావత్తు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా కాలంగా వాగ్దానాలే తప్ప నాయకుల హామీలు కార్యరూపం దాల్చాయంటే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇదేంటని ఎవరన్నా ప్రయత్నిస్తే ఈ దేశంలో వారికి మనుగడ కరువైతుందనడం వాస్తవం. ఎన్ని విషయాలు ప్రస్తావించినా పాలకుల్లో మార్పురానప్పుడు అది ప్రజలకు నిరాశనే మిగులుస్తుంది. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం దేశ అభివృద్ధికి పాటుపడుతూ, ప్రజలకు ఒక నమ్మకాన్ని కలుగజేస్తూ, సమస్యలపై దృష్టికేంద్రీకరించి జనం కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్రజలకు నమ్మకాన్ని కల్గిస్తూ ముందుగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరుస్తూ, నిరుద్యోగ నిర్మూలన గావిస్తూ అభివృద్ధికి పలు పథకాలు చేపడుతూ ముందుకు సాగాల్సి ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని నేతలు భావించరాదు.
సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికో, మరో ఐదేళ్ళ కాలంలో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే దృష్టి కేంద్రీకరించడానికో నాయకులు ప్రయత్నిస్తే- వారికి తగిన శాస్తి జరుగక తప్పదు. కనుక పాలకులు వారి దృష్టిని అభివృద్ధిపై కేంద్రీకరించి, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది. దానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు వచ్చినా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదన్నది నిజం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు వున్నది. ఇనే్నళ్ళు గడిచినా అనుకున్న అభివృద్ధిని సాధించలేక పోవడానికి కారణం నేడు డబ్బుతో ముడిపడిన రాజకీయ వ్యవస్థయే కారణమని చెప్పక తప్పదు.
ఎన్నికల కమిషన్, రాజకీయ పార్టీల్లోని మేధావులు, విద్యారంగంలోని నిపుణులు ముందుకువచ్చి డబ్బుతో ముడిపడి వున్న రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులుతేవడానికి పూనుకోవాలి. ఇది కొంచెం కష్టతరమైన పనిలా అనిపించవచ్చు. మరీ ముఖ్యంగా డబ్బున్న రాజకీయ నాయకులకు, రాయితీల కోసం ఆరాటపడే ఓటర్లకు ఇంకా ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ అవినీతి రహిత పాలన వల్లే దేశాభివృద్ధి జరుగుతుంది.
ఇక, దేశవ్యాప్తంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసిన వ్యయాన్ని చూస్తే ఐదేళ్ళ దేశ బడ్జెటును దాటినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఒక అభ్యర్థి భారీగా డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నాడంటే, మరలా అంతకుమించి సంపాదించుకోవాలి. వివిధ కార్పొరేటు సంస్థలు, కాంట్రాక్టర్లు, వాణిజ్యవేత్తలు రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో ఖర్చుపెట్టడానికి ధన సహాయం చేస్తుంటారు. ఇది ప్రత్యక్షంగా నిరూపణ చేయలేకపోయినప్పటికీ అందరికీ తెలిసిన విషయమే. ఏదో ప్రతిఫలాన్ని ఆశించే వాణిజ్య వేత్తలు, కార్పొరేట్ వర్గాలవారు ఇలా చేస్తున్నారన్నది వాస్తవం. డబ్బుతో ముడిపడని రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి. దేశవ్యాప్తంగా అవినీతి అనే ఊసే లేకుండా ఒక ప్రత్యేక నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి అందరూ దానికి కట్టుబడి వుండేటట్లు చేయడం అవసరం.

-డా.పోలం సైదులు