AADIVAVRAM - Others

విజయానికి ఏడు మెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం మనసులో ఏది మనోసిద్ధితో అనుకుంటే అది సాధించే సత్తా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు రుజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెళ్లండి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన ఆటల పోటీల్లో బహుమతిని సాధించిన తీయని జ్ఞాపకాలు మరువలేనివి. తరగతిలో మంచి మార్కులు సాధించడం, ఉద్యోగిగా ఉత్తమ అవార్డును సొంతం చేసుకోవడం ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మన జీవితంలో చూసే ఉంటాం. విజయాల వల్ల డబ్బు, గౌరవం, పేరు ప్రతిష్ఠలు, కష్టానికి తగు ప్రతిఫలం సాధించామన్న తృప్తి కలుగుతాయి.
ప్రతి మనిషిలో ఉండే ఆలోచన ఒక్కటే - విజయం సాధించాలి. అందరికీ విజయం సిద్ధిస్తుందా.. ఓటమి ఎదుర్కొనే వారు ఎవరూ విజయం అనే పదాన్ని గంభీరంగా ఉచ్ఛరించగానే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా.. ఈ మధ్య తెలంగాణలో వి.ఆర్.ఓ. ఉద్యోగం కోసం నిర్వహించిన రాతపరీక్ష కోసం 11 లక్షలకు పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ విజయం చెంతకు వస్తుందా.. అందరిలో కొందరికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల కోసం, పై చదువులలో ఉన్నత అవకాశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలలో విజయం సాధించాలంటే ఏం చేయాలి.. ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి రోజుకు ఉన్న 24 గంటల్లో 20 గంటల పాటు తీవ్రంగా శ్రమించేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. విజయం అంత సులభంగా లభించకపోవచ్చు. కానీ అసాధ్యమైందేమీ కాదు. కఠోర దీక్ష పట్టుదల ఉంటే ఏదైనా సరే మన సొంతం అవుతుంది.
విజయం మీ సొంతం కావాలంటే.. (ఒఖషషళఒఒ)
డ డఆ్ఘక చ్యిషఖఒళజూ లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించాలి.
శ్రీ శ్రీశత్ఘ్పీళూజశ జూళఆళూౄజశ్ఘఆజ్యశ ఆ్య ఒఖషషళళజూ విజయం సాధించాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి.
ళ ళ్యశచ్యిశఆ చిళ్ఘూ మనసులో ఉండే భయాన్ని అధిగమించాలి.
ళ ళ్యౄఔ్ఘజశ జఆఆళ ఘశజూ ష్దళూజఒ్ద యూౄళ తక్కువగా నిందించాలి మరియు ఎక్కువగా కృషి చేయాలి.
ఉ ఉశష్యఖ్ఘ్ళూ క్యఖూఒళఛి, యెశ’ఆ ఇళ ళశ్పజ్యఖఒ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. అసూయ పడరాదు.
డ డఆ్ఘఆ శ్యతీ ఇప్పుడే ప్రారంభించాలి.
డ డఆ్యఔ శ్యఆ ఆజ క్యఖూ య్ఘ జఒ ఘషష్యౄఔజఒ్దళజూ మీరు మీ లక్ష్యాన్ని ఛేరుకునే వరకు విశ్రమించరాదు.
1.ఎస్ - లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి.
విజయ సాధనలో ప్రధానమైనది ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యంపై ఎల్లప్పుడూ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి. ఒకటి లేదా రెండు రోజులు ప్రయత్నిస్తేనే విజయం లభించడం కష్టం. లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు, అపజయాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అంతమాత్రాన కృంగి పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటమి నుండి కూడా విజయం సాధించడానికి కావలసిన మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం సాధన దిశగా ముందడుగులు వేస్తూ ఉండాలి.
2.యు - సాధించాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి.
ఎల్లప్పుడూ విజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. మన మనసులో బలంగా నిర్ణయించుకోవాలి. విజయం సిద్ధించే వరకు వెనుకడుగు వేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా సాధ్యమైనంత వరకు విజయం కోసం కష్టపడాలి. లక్ష్యసాధన కోసం నింరతరం తపిస్తూ మన కృషి మనం చేస్తూ ఉండాలి.
3.సి - భయాన్ని అధిగమించాలి
చాలామందిలో అమ్మో ఇంత కష్టమైన పనిని నేను సాధిస్తానా అనే భయం మనసులో వెంటాడుతూ ఉంటుంది. గతంలోని ఓటమిలు, వైఫల్యాలు మన మనసును భయపడేలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి ఓటమిలో, ప్రతి వైఫల్యం వెనుక దాగి ఉన్న రహస్యాలను అవగాహన చేసుకోగలిగితే మనలో దాగి ఉన్న సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో భయాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. ఓటమికి భయపడాల్సిన పని లేదు. ఓటమితోటి విజయానికి మెట్లను ఏర్పరచుకో గలిగిన స్థాయికి ఎదగాలి.
4.సి - తక్కువగా నిందించాలి మరియు ఎక్కువగా కృషి చేయాలి.
ఇతరుల వైఫల్యాలు మన విజయానికి గుణపాఠాలుగా ఉండాలి. ఒక వ్యక్తి వైఫల్యాలపై తక్కువ ఆలోచించడం చేయాలి. ఆ వైఫల్యం వెనుక దాగి ఉన్న కారణాలను పరిష్కార మార్గం కోసం ఎక్కువగా కృషి చేయాలి. ఇతరులను నిందించడం తక్కువగా చేయాలి. మనలోని శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకొంటూ లక్ష్య సాధన కోసం ఎక్కువ కృషి చేయాలి.
5.ఇ - మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. అసూయ పడరాదు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. మనలో ఉన్న నైపుణ్యాలను మనకు మనముగా ఎల్లప్పుడూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మనలో లేని నైపుణ్యాలను ఇతరులలో గమనించినపుడూ అసూయ పడకుండా మన మనసుకు తగు సూచనలను జారీ చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకత. ఇతరులతో పోల్చుకోవడం అనేది దరిదాపులకు రానీయకూడదు. మనలో ఉన్న సామర్థ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వాసాన్ని దృఢపరచుకోవాలి.
6.ఎస్ - ఇప్పుడే ప్రారంభించాలి.
విజయ సాధనలో చివరి ప్రయత్నం అనే మాటను దరి చేరనీయకూడదు. విజయం సాధించడానికి పనిని ప్రారంభించడానికి నిర్దిష్ట సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో పనిని ఈ సమయంలోనే ఇప్పుడే ప్రారంభించాలి. సరైన మార్గదర్శకత్వం కోసం ఒక్క మెంటారును ఎంచుకోవాలి.
7.ఎస్ - మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరాదు.
లక్ష్య సాధనలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల ఆలోచనలను మనసులో పెంపొందించుకోవాలి. సాధించిన వ్యక్తుల స్టోరీలను చదవాలి. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి. లక్ష్యసాధనకు ప్రణాళికను ఏర్పరచుకోవాలి. అభ్యాసనను తీవ్రతరం చేయాలి. ఫలితం గురించి ఆలోచనలు చేయకూడదు. విజయ సాధన కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకుండా సానుకూల ఆలోచనలతో ముందుకు వెళితే విజయం సొంతం అవుతుంది. ఎన్ని రకాల అపజయాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదు. మిమ్మల్ని చూసి విజయం కూడా భయపడి మీ దగ్గరకు చేరేలా పట్టుదలతో కృషి చేయండి.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321