Others

దేశం కోసం పోరాడతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత వైమానిక దళం 2017లో తొలిసారి ఫ్లైట్ లెఫ్టినెంట్లుగా మహిళలను ఎంపిక చేసింది. ఆ మొదటి బ్యాచ్‌లోనే భావనాకాంత్ అర్హత సాధించింది. భావనాకాంత్ బిహార్‌లోని దర్భాంగ్‌కు చెందిన మహిళ. ఈమె అక్కడే తన ప్రాథమిక విద్యను ముగించింది. తరువాత బెంగళూరులోని బీ ఎమ్మెస్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఎంతో ఆసక్తితో వైమానిక యుద్ధ రంగంలోకి అడుగిడింది. అక్కడ శిక్షణ ముగించిన అనంతరం 2017లో ఫైటర్ స్వ్కాడ్రన్‌గా చేరి ఏడాదిలోపే భావన ఒంటరిగా మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా భావన ఇప్పుడు అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. శిక్షణలో భాగంగా మిగ్-21 బైసన్ విమానాన్ని పగటిపూట విజయవంతంగా నడిపింది. దీంతో యుద్ధవిమానంలో పోరాట ఆపరేషన్లు చేపట్టేందుకు అర్హత సాధించిన తొలి మహిళా లెఫ్టినెంట్‌గా చరిత్రలో నిలిచింది. టెక్కికల్ ఫ్లైయింగ్‌తోపాటు, యుద్ధ్భూమిలో విమానం నడపడంలో కూడా శిక్షణ తీసుకున్న భావన పగటిపూట మాత్రమే కాకుండా, రాత్రివేళల్లో కూడా యుద్ధవిమానాన్ని అవలీలగా నడిపే సామర్థ్యాన్ని నేర్చుకుంది. దీంతో త్వరలో 3ఆపరేషన్ ఇన్ ద మూన్ ఫేజ్2తో పాటు 3డార్క్‌ఫేజ్2 పేరుతో శిక్షణ తీసుకోనుంది. అంటే.. పగలు, రాత్రితో సంబంధం లేకుండా అన్నివేళలా యుద్ధ విమానాన్ని నడిపే అర్హతను ఈ శిక్షణ ద్వారా పూర్తిస్థాయిలో పొందనుంది. ఆమె పట్టుదల, కృషి చూసినవారు 3విధుల పట్ల అంకితభావం, లక్ష్యం కోసం ఆమె చేసిన కృషి అభినందనీయం2 అంటూ ఆమెను అభినందిస్తున్నారు. దీని గురించి భావన మాట్లాడుతూ.. 3శిక్షణ ముగిసిన తరువాత పగటిపూట యుద్ధవిమానాన్ని ప్రయోగాత్మకంగా నడిపే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని నా జీవితంలో అత్యున్నత విజయంగా భావిస్తున్నా.. అయితే ఇది మొదలు మాత్రమే.. ఇక ఫైటర్ పైలెట్‌గా విధులు నిర్వహించాలనేదే నా లక్ష్యం. దేశం కోసం పోరాడతా..2 అని చెబుతోంది భావన.