Others

గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడైనా కాలం కలిసి వస్తే
పొమ్మనకు నేస్తం
ఇన్నాళ్లు ఎందుకు రాలేదని అలిగి
గొడవ పడకు
అందర్నీ కాదని ఎందరినో వద్దనుకుని
నీ దగ్గరికి వచ్చాను సుమా

పిలిచినప్పుడు రాలేదని విసుక్కోకు
మళ్ళీ వెళ్లిపోతుందేమోనని
నన్ను బంధించకు సుమా
రాత్రికి రాత్రికి మధ్య
నిశ్శబ్దంగా జారిపోతుంటాను నేను
నేను క్యాలెండర్లో లేను
జీవితంలోనే ఉన్నాను

దాచుకున్న జ్ఞాపకాలను తలపిస్తాను
దూరమైన బంధాలనూ కలుపుతాను
నేను ఎవరి చెప్పుచేతల్లో లేను మిత్రమా
క్షణాలను ప్రాణంగా మలుచుకొని
సంవత్సరాలను కొలుచుకుని
బతుకుతున్న మీకు
నేనెప్పుడూ సుదూరంగానే అనిపిస్తా
కానీ మీ చెంతనే నిలబడి ఉంటా

ఈరోజు నిన్నటికి పొడిగింపు
రేపు మరో రోజు జోడింపు
కాలగమనంలో మార్పులు సహజమే
నిన్న సాధించలేని ఎన్నో ఆశయాలు
నేడు నిజం చేసుకో
జీవిత చరమాంకంలో
ఒక్కసారి వెనక్కి చూస్తే
నీ ఉనికిని చాటే ఒక్క సందర్భం చాలు
జీవితంలో విజయం సాధించినట్టే!
నీ ఉనికే నేను కదా...

- ములుగు లక్ష్మీమైథిలి, 9440088482