AADIVAVRAM - Others

‘ప్రేరణ’ విషయంలో గుర్తుంచుకోవాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ మీకున్న దానిని గుర్తుంచుకుని అభినందించుకోవాలి.
శ ఏదీ నమ్మదగినది కాదు. కాబట్టి అటువంటి వాటిపై పందెం వేయకూడదు.
శ అసంభవం అంటే అర్థం ప్రణాళిక ప్రకారం జరగకపోవచ్చు. ఆ పని జరగడానికి మరి కొంత ఎక్కువ కాలం పడుతుందని అర్థం.
శ మీరు ప్రయాణం చేసే దిశను మీ తొలి అడుగు నిర్ణయిస్తుంది.
శ స్ఫూర్తిలేని లక్ష్యాలు స్ఫూర్తిలేని ఫలితాలను ఇస్తాయి.
శ మీ మార్గంలో అడ్డగించే ఎటువంటి పెద్ద ఆటంకము ఎప్పుడూ ఉండదు. లేదా దానిని అధిగమించలేక పోవడం ఉండదు.
శ అలవాటుకి మించి మరేదీ మీ జీవితాన్ని మరింత లౌకికం చేయలేదు.
శ మంచి లేదా చెడు అనుభవం ఏదైనా మీకు విలువైన ఆస్తి.
శ సీమ కుందేలు జిత్తులమారి నక్కకు దొరకకుండా పారిపోగలదు. ఎందుకంటే నక్క ఆహారం కోసం పరుగు తీస్తుంటే కుందేలు జీవితం కోసం పరుగులు తీస్తుంది.
శ మీ పరిస్థితి ఎంత చెడుగా వున్నా, మీ గురించి మీరు కొత్తగా తెలుసుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది.
శ మీకు రావలసిన దాని గురించి, లేదా మీకు కావలసిన దాని గురించి గరిష్ట స్థాయిలో కృషి చేయాలి.
శ చేయడం సాధించడానికి దారి తీస్తుంది. ఉనికి ఆకర్షణీయంగా ఉంచుతుంది.
శ సమస్యలు ఉపాధ్యాయులు అవి అడ్డంకులు కావు.
శ మీరు అనుకున్నట్లు మీరు ఉంటారు.
శ శక్తిని ఉపయోగించుకోవచ్చు లేదా పోగొట్టుకోవచ్చు.
శ ఏది బలంగా లోనికి వెడుతోందో అది ఏది బయటకు వస్తోందో దానిని పోలి ఉంటుంది.
శ ఎక్కడ ప్రారంభించారన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెడుతున్నారో ముఖ్యం.
శ విపత్తు అనేది అవకాశాన్ని చుట్టేసి దాచే కాగితం లాంటిది.
శ మీ లక్ష్యం గురించి మీరేమి అనుకుంటున్నారో అది ముఖ్యం గాని ఇతరులు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదు.
శ సమస్యను మీరు ఏమి చేయబోతున్నారు అనేది ముఖ్యం గాని సమస్య మిమ్మల్ని ఏమి చేస్తుంది అనేది ముఖ్యం కాదు.
శ కలలు కనాలి. ఒక్కొక్కప్పుడు అవి నిజ రూపం దాల్చవచ్చు.
శ అడ్డు అనేది లక్ష్యం మీద దృష్టి కేంద్రీకరించడం ఆగినప్పుడు కన్పిస్తుంది.
శ ఒక కెరటం వచ్చినపుడు అది తనతోపాటు అన్ని వస్తువులను పైకి లేపుతుంది.
అనువర్తనం
శ అత్యాసక్తిని అలవాటుగా చేసుకోవాలి.
శ కృషి చేయాల్సిన సమయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు.
శ నిత్య జీవితంలో ప్రతిరోజు సంతృప్తిని పొందుతూ ఉండాలి. ఎప్పుడో పెద్ద బ్రేకు వస్తుందని ఎదురుచూడకూడదు.
శ మీకు ఇష్టమైన 20 పనుల జాబితా రాసుకోవాలి. ఒక్కొక్క పని పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టిందో చూసుకోండి. మీ వ్యక్తిగత సంతోషాన్ని నిర్లక్ష్యం చేయడం వ్యతిరేక స్ఫూర్తికి దారితీస్తుంది.
శ మీకు అవకాశం ఏ నిమిషంలోనైనా మీ ముందు ఉండవచ్చు. తయారుగా ఉండాలి.
శ మీ చుట్టూ ఎప్పుడూ అనుకూల ధోరణి, అత్యాసక్తిగల వ్యక్తులు ఉండేటట్లు చూసుకోవాలి.
శ పనికి సంబంధం లేని స్పోర్ట్స్, మీ సరదాలు వంటి వాటిలో పాల్గొని జీవితాన్ని అనుభవిస్తూ, విజయ మార్గం సుగమం చేసుకోవాలి.
శ ఏ ఆటలో పాల్గొన్నా మీరు ఆడగల్గినంత ఉత్తమంగా ఆడాలి.
శ మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మీకు మీరే స్పష్టమైన నియమాలు ఏర్పరచుకుని ఎటువంటి ధోరణులకు, వెర్రి భ్రమలకు లోనయి కలత చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
శ లక్ష్యాలు స్పష్టంగా ఏర్పరచుకోవాలి. సాధించలేని మీకు సత్తా లేని లక్ష్యాలను పెట్టుకోకూడదు. జీవితంలో ఐఎఎస్ లక్ష్యంగా పెట్టుకోవాలంటే అంతకు ముందు మీకు కొన్ని హిట్ రికార్డులు ఉండాలి. లేకపోతే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం అవుతుంది.
శ మీ ప్రేరణకు నష్టం కల్గించే ‘ఓటమి భయం’ ‘ప్రాధాన్యతలలో మార్పు’ ‘అనిశ్చలత’ ‘ఒంటరితనం’ ‘అసూయ’ ‘కోపం’ ‘నిరుత్సాహం’ ‘తెలియని భయం’ వంటి వాటిని గుర్తుంచుకుని వాటిని దరిజేరనీయకూడదు.
శ ఇతరుల వ్యతిరేక ధోరణి ప్రభావం మీ మీద పడకుండా జాగ్రత్త పడాలి.
శ మీ బలహీనతలు మీ బలాలను కప్పివేయకుండా చూసుకోవాలి.

-సి.వి.సర్వేశ్వరశర్మ