Others

విష్ణుతత్వాన్ని వెల్లడించిన పరశురాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరశురాముడు జమదగ్ని, రేణుకల కుమారుడు. ఇతడు తండ్రి మాటనువిని తల్లి తలను నరికివేశాడు. తనమాట విన్నందుకు ఆ తండ్రి మెచ్చుకుని ఏం వరంకావాలో కోరుకోమన్న తండ్రితో తల్లిని బతికించమని వేడుకున్నాడు. తల్లిదండ్రుల పైన అపారమైన భక్తి ప్రేమ గౌరవం ఉన్న మహర్షి పరశురాముడు.
దత్తాత్రేయుని శిష్యుడు కార్తవీర్యార్జునుడు ఒకసారి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి తన పరివారంతో వస్తాడు. అపుడు జమదగ్ని తన దగ్గరఉన్నకామధేనువు సహాయంతో కార్తవీర్యార్జునునికి అతని పరివారానికి విందుభోజ నాలు ఏర్పాటు చేస్తాడు. అంతేకాక వారికి సకల సదుపాయాలను విశ్రాంతికోసం కల్పిస్తాడు జమదగ్ని మహర్షి.
అదంతా చూసి కార్తవీర్యార్జునుడు జమదగ్నిని ఆ కామధేనువు నిమ్మని అడుగుతాడు. దానికి జమదగ్ని మహర్షి నిరాకరిస్తాడు. అపుడు కార్తవీర్యార్జునుడు ఆగ్రహుడై వెళ్లిపో తాడు. మరలా తిరిగి వచ్చి బలవంతంగా కామధేనువును జమదగ్ని ఆశ్రమంనుంచి తోలుకుని వెళ్లిపోతాడు.
ఆ సమయంలో పరశురాముడు తీర్థయాత్రలకు వెళ్లి ఉంటాడు. ఆ తరువాత వచ్చి విషయం తెలుసుకొని బలవంతంగా కామధేనువును తీసుకొని పోయిన కార్తవీర్యార్జునుడి పై కోపం తెచ్చుకుని ఆయన రాజ్యానికి వెళ్లి అక్కడే వేయి చేతులున్న కార్తవీర్యార్జునుని బాహువులు తెగనరికి కామధేనువును తీసుకొని తిరిగి తండ్రి ఆశ్రమానికి వస్తాడు. ఇలా చేశానని తండ్రికి పరశురాముడు చెప్పితే మహర్షులకు కోపం పనికిరాదు. నీవు వెళ్లి పుణ్యక్షేత్రాలు దర్శించమని జమదగ్ని చెప్తాడు. తండ్రి మాట ప్రకారం పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లిన సమయంలో కార్తవీర్యార్జునుని కుమారులు వచ్చి తపోదీక్షలో ఉన్న జమదగ్ని తలను నరికివేసి వెళ్లిపోతారు. ఈ సంగతి రేణుక చూసి ‘పరశురామా’ అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆ ఏడుపు విని పరశురాముడు పరుగెత్తుకు వచ్చి విషయం తెలుసుకొని ఆగ్రహావేశుడు అవుతాడు. కార్తవీర్యార్జుని కొడుకులపైకి యుద్ధానికి వెళ్తుంటే అక్కడి అతని తాత గారు వచ్చి జమదగ్ని మహర్షిని తిరిగి పునర్జీవింపచేస్తాడు. కానీ తన తల్లికి ఆవేదన కలిగించిన అహంకారులు ఉండకూడదని పరశురాముడు 21 సార్లు దండెత్తి వెళ్లి క్షత్రియనాశనం చేస్తాడు. త్రేతాయుగంలో రాము డు సీతమ్మవారిని పెళ్లిచేసుకొని వస్తుంటే ఈ విషయం పరశురామునికి తెలుస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న విష్ణుచాపాన్ని తీసుకొని అయోధ్యకు వెళ్తున్న రాముని దగ్గరకు వచ్చేస్తాడు. నీవు శివుని విల్లు విరిచావట కదా. మరి నా దగ్గర ఉన్న విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టినట్లు అయితే నీవు పౌరుషవంతుడివని నేను అనుకొంటాను. నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని రాముని అడుగుతాడు. అపుడు రాముడు విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి నా బాణం వృథాగా పోరాదు. మరి మీరేమో నాకు గురుతుల్యులు. మా గురువుగారి స్నేహితులు. కనుక మీ పుణ్యభూములను కొల్లగొల్లమంటారా? లేక మీ పాదగమనాన్ని నిరోధించమంటారా చెప్పండి అని రాముడు అడుగుగా అపుడు పరశురాముడు నీవు ఎవరివోనాకు తెలిసింది. నీవు మహావిష్ణువే. కనుక నా పుణ్యభూములపై నీ బాణాన్ని వదులుము. నేను మహేంద్రగిరి కి వెళ్లి తపస్సు చేసుకొంటాను. నీ దర్శనం తో నా మనస్సు ప్రశాంతత పొందింది అని పరశురాముడు చెప్తాడు. ఇట్లా రామునిలోని విష్ణు తత్వాన్ని పరశురాముడు వెల్లడిస్తాడు.

- చివుకుల