Others

ప్రతిధ్వని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్వనులు లేకుంటే
ప్రతిధ్వనులెక్కడివి!
వెరసి వాటి సంఖ్య
అసంఖ్యాకంగా పెరిగిపోతుంది
ధ్వనులకు మరణముంటుందా!
బహుశా అవి
జ్ఞాపకాల్లో బతుకుతాయ.

ఒక కేకను
కొండలన్నీ పంచుకుంటాయ,
రాళ్ళకు నోళ్ళు మొలిచి
వాటికే ఆశ్చర్యం కలుగుతుంది
లోయల్లో వెదురువనాలు
నిశ్శబ్దాన్ని పాటలుగా మలుస్తాయ
కొండొకచో
ధ్వనికీ దృశ్యానికీ
భేదం చెరిగిపోతుంది
పూలరేకులు
సీతాకోక రెక్కల్లా కొట్టుకున్నప్పుడు
ఎక్కడినుంచో
కవిత్వం ఉబుకుతుంది
వినగలిగితే
చీమల బారు కాళ్ళచప్పుళ్ళకు
భూనభోంతరాలు బద్దలౌతాయ
చిన్నప్పటి రైలు చప్పుడు
తెల్లారగట్ల నా ప్రయాణాన్ని
పునఃప్రసారం చేస్తుంది

అంతెందుకు!
దీనజనుల ఆర్తనాదాలు
మనస్సును చీలుస్తూనే ఉంటాయ
సమాధుల్లోంచి
కన్నీటి ఊటల గలగలలు
స్మృతులను మెలిపెడుతూనే వుంటాయ

నిశ్శబ్దాన్ని తట్టుకోవడం
అంత సులభం కాదు
ప్రతిధ్వనులు లేకుంటే
ప్రతి జీవీ
ఒక ఒంటరిదీవిగా మిగిలిపోతాడు.

- డా. ఎన్. గోపి