Others

అందమైన ముఖం కోసం వ్యాయామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఆశిస్తుంటారు. అయితే ఇందుకనుగుణంగా చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఇక్కడ మీకు పరిచయం చేస్తున్న వ్యాయామం సహాయంతో మీరు మీ శారీరక సమస్యల్ని క్రమంగా దూరం చేసుకోవచ్చు.
చుబుకం, పొట్ట, వక్షస్థలం, పిరుదులలో చేరుకున్న అధిక కొవ్వు నుండి విముక్తి పొందవచ్చు. మీ నడకలో చురుకుదనం, వ్యక్తిత్వంలో ఆకర్షణ, యవ్వనంలో అనుభూతి వాటంతటవే వస్తాయి. అద్దంలో ఒకసారి పరీక్షగా మీ ముఖాన్ని చూసుకోండి. ముఖంనుండే వ్యాయామం మొదలుపెట్టండి. మీ ముఖం, దాని స్వరూపం, ముఖ భంగిమలు, ముఖంలోని జీవకళ- వీటిని బట్టి ఇతరులు మీ గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు.
ముఖ వ్యాయామంలో కళ్ళు, బుగ్గలు, పెదాలకు సంబంధించిన వ్యాయాయము కూడా కలిసి ఉంటుంది. వ్యాయామం ప్రతిరోజూ చేస్తున్నారా? లేదా? ఎంతసేపు చేస్తున్నారు! అనే విషయం అతి ముఖ్యం. పది నిమిషాల సమయం సరిపోతుంది. వ్యాయామం నిదానంగా చేయాలి. నిటారుగా వుండే కుర్చీలో కూర్చుని వ్యాయామం చేస్తే మంచిది. కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. చేసేవారు నిటారుగా ఉండాలి. చుబుకం భుజాలకంటే ఎత్తులో ఉండాలి.
బుగ్గలను గాలితో నింపాలి
ముక్కుతో బలంగా ఊపిరి లోపలికి పీల్చాలి. పెదవులు నొక్కిపట్టి గట్టిగా ఒక్కసారి గాలి బయటకు వదిలేయాలి. ఇలా మూడు నాలుగుసార్లు చేయాలి.
పైన చెప్పిన వ్యాయామం పద్ధతిని వేళ్ళతో పెదవులు వాటి స్థానంలోనే ఉండేలా అణచిపెట్టి చేయాలి.
* ముక్కుతో ఊపిరి లోపలికి పీల్చాలి. ఎడమ బుగ్గను గాలితో నింపి నోరు ఎడమ మూలనుండి గట్టిగా ఊపిరి బయటకు వదిలేయాలి. ఇలా కుడివైపు కూడా మూడు నాలుగుసార్లు చేయాలి.
* బుగ్గల్ని గాలితో నింపి గాలిని ఎడమవైపు నుంచి కుడివైపునకు మళ్లించాలి. ఈ వ్యాయామాలతో బుగ్గల్లోని కండరాలు బాగా పనిచేస్తాయి. నోటి దగ్గర నిలువుగా ఏర్పడే ముడతలు తొలగిపోతాయి.
* దవడలు కదల్చకుండా పెదవుల్ని కొద్దిగా తెరచి మళ్లీ మూయాలి. ఇలా ఐదు లేక ఆరుసార్లు చేయాలి.
* ఆ, ఈ, ఓ, ఊ స్వరాలను ఐదు లేక ఆరు సార్లు ఉచ్చరించాలి. ఈ రెండు వ్యాయామాలు పైపెదవిమీద వున్న ముడతల్ని తొలగిస్తాయి. ఐదు సెకన్లపాటు కనురెప్పల్ని గట్టిగా మూసుకోవాలి. ఆ తర్వాత 5 సెకన్లపాటు కళ్ళను పూర్తిగా తెరచి ఉంచాలి. ఇలా చేసేటపుడు నొసటిపై ముడతలు పడకూడదు. ఈ విధంగా నాలుగుసార్లు చేయాలి.
* కనుగుడ్లను మెల్లగా గుండ్రంగా తిప్పాలి. ఏదైనా తిరుగుతూ వున్న ఒక పెద్ద చక్రంపై దృష్టి నిలిపినట్టు ఊహించుకోవాలి. ఆ చక్రం రెండుసార్లు ఒక దిశలో, ఇంకో రెండుసార్లు వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్టుగా ఊహించుకుని కనుగుడ్లను అదేవిధంగా తిప్పుకోవాలి. ఇలా 3-4 సార్లు చేయాలి.
* 1 నుండి 10 వరకూ అంకెల్ని గబగబా పలకాలి. అంకె పలికిన ప్రతీసారీ కనురెప్పలు మూయాలి. మూడు సెకన్లు ఆగి మళ్లీ రిపీట్ చేయాలి. ఇలా మూడు నుండి ఆరుసార్లుచేయాలి. ఇలా చేస్తే కంటికి సంబంధించిన కండరాలలో, కంటిదగ్గర రక్తనాళాలలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది.
* తలను ఎడమవైపు నుండి కుడివైపునకు, మళ్లీ కుడివైపునుండి ఎడమవైపునకు పూర్తిగా తిప్పాలి. ఆపై కిందకు నేలవైపు ఉంచాలి. ఊపిరి బయటకు వదలి కండరాలను వదులు చేయాలి.
ఈ వ్యాయామాలతో ముఖంలో రక్తప్రసరణ ఎక్కువ జరుగుతుంది. ఇలా రెండు లేక 3సార్లు చేయాలి. ఇలాంటి వ్యాయామాలలో ఏది చేయాలన్నా వారికున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికివారే నిర్ణయం తీసుకోవాలి.

- పి.ఎం. సుందరరావు 94906 57416