Others

ఎవరెవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కసారి గనక ఒక్కసెంటిమెంట్ పడిందీ అంటే దాన్ని మార్చడం
చిత్ర పరిశ్రమలో ఎవరికీ సాధ్యంకాదు. ఎవరి సెంటిమెంట్లు వారివి.
ఎదుటివాళ్ల సెంటిమెంట్‌తో మనకు పనిలేదని భీష్మించుకొని కూర్చున్నా ఒక్కొక్కసారి ఎదుటివాళ్ల సంగతి కూడా గమనించాల్సి వస్తుంది.
ఈ గమ్మత్తయిన అంశం జనతాగ్యారేజి చిత్రానికి సంబంధించిన హీరోయిన్ల విషయంలో జరుగుతోంది. నాన్నకుప్రేమతో చిత్రంతో విజయపధంలో
నడుస్తున్న ఎన్టీఆర్ తాజాగా రూపొందిస్తున్న జనతాగ్యారేజి చిత్రంలో
నటించడానికి హీరోయిన్‌కోసం వెదుకుతున్నారు. రెండో కథానాయికగా ఇప్పటికే నిత్యామీనన్ ఎంపికైపోయింది. మరి ప్రధాన హీరోయిన్ ఎవరు అంటే ఇంకా సస్పెనే్స సాగుతోంది. నాన్నకు ప్రేమతో చిత్రంలో తనతో నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ అయితే బాగుంటుందని కథానాయకుడు ఎన్టీఆర్ చెబుతున్నాడట. అయితే దర్శకుడు కొరటాల శివకు మాత్రం తనకు సక్సెస్ ఇచ్చిన శ్రీమంతుడు కథానాయిక శృతిహాసన్‌ను తీసుకోవాలని పట్టుబడుతున్నాడు. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే రకుల్‌ప్రీత్‌సింగ్, కాజల్ అగర్వాల్, శృతిహాసన్, రెజీనా, రాశిఖన్నా తదితరుల పేర్లు పరిశీలించారు. చిట్టచివరికి దర్శకుడు, హీరో రెండు పేర్లను చెబుతున్నారు. చివరికి ఇద్దరూ కలసి ఎవరు ఎవరిని నిర్ణయిస్తారో వేచి చూడాల్సిందే! ఎవరైనా సక్సెస్ వస్తేనే బెస్ట్
అని మరో సెంటిమెంటూ!