Others

196 దేశాలు పర్యటించి.. గిన్నిస్ రికార్డు సాధించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి చిన్న వయసులోనే 196 దేశాలు చుట్టివచ్చిన మహిళగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది లెక్సి ఆల్ఫ్రెడ్. అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ చిన్నవయస్సులో 196 దేశాలు చుట్టిరావాలన్న తన జీవిత లక్ష్యాన్ని సాకారం చేసుకుంది. ఆల్ఫ్రెడ్ వయస్సు కేవలం 21 సంవత్సరాలే.. ఈ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు సంపాదించడం కోసం తన కుటుంబానికి చెందిన ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది ఆల్ఫ్రెడ్. ఇందులో పనిచేయడం వల్లే ఆమెకు ప్రయాణాలపై ఆసక్తి పెరిగిపోయింది. తన ప్రయాణానికి కావాల్సిన డబ్బును ఆమే సమకూర్చుకుంది. ఇందుకోసం ఆమె కనిపించిన ప్రతి పనీ చేసింది. అలా పనె్నండు సంవత్సరాల నుండే డబ్బులు సంపాదించి, దాచుకోవడం మొదలుపెట్టింది. 2016 నుంచి ఈ రికార్డు సాధనపై తీవ్రంగా దృష్టి సారించింది. తన పర్యటనలో భాగంగా ప్రతి దేశంలో రెండు, మూడు రోజులకంటే ఎక్కువకాలం గడపలేదని తెలిపింది. ఆరునెలలపాటు అనేక అవాంతరాలను ఎదుర్కొని ఎంతో ఆత్రుతగా ఈ రికార్డు కోసం ఎదురుచూసింది ఆల్ఫ్రెడ్. ప్రస్తుతం 24 సంవత్సరాల మహిళ మీద ఉన్న రికార్డును ఆల్ఫ్రెడ్ బద్దలు కొట్టింది.