Others

చూడుమోయ సూర్యదేవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువుకున్నట్టి వారిని సరకుగొనక
భజనఁ చేతురు చవటల పంచఁ జేరి
బుద్ధియై పోయెఁ జూడంగ బురదపాలు
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: చదువుకున్న జ్ఞానవంతులను ఏ మాత్రం లెక్కచేయకుండా చదువుకోని సంపన్నులైనట్టి వారి చుట్టూ భజనపరులుగా చేరుతూ ఉంటారు. అలాంటి వాళ్ల బుద్ధి కాస్తా బురదపాలైపోయిందికదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య!

బాధ్యతలు విస్మరించియు బంధములనుఁ
ద్రెంచుకొని విచ్చల విడిగఁ దిరుగువారు
హెచ్చి నారలీ లోకాన హీనమతులు
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!

భావం: బాధ్యతలన్నీ విడిచి పెట్టి బంధాలన్నీ త్రెంచుకుని విచ్చలవిడిగా తిరగే హీనమతులీ లోకంలో పెరిగిపోయారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్య.

డబ్బు చుట్టూతఁ దిరుగుచు జబ్బుపట్టి
మంచమునఁ బడిపోయినఁ గుత్సితమును
వీడి పోర వివేకులు విశ్వమందు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: డబ్బు చుట్టూ తాము తిరుగాడుతూ జబ్బు పట్టిమంచాన పడినప్పటికీ కుత్సిత భావాలను విడిచి పెట్టలేకున్నారీ విశ్వాస కర్మసాక్షివైన ఓసూర్యదేవా! చూడవయ్య.
తాను బాగున్నఁ జాలనిఁ దలచువారు
పరులు బాగున్నచో నేడ్చు బహువిధాల
మనుజ జాతికి మచ్చగ మసలువారు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: తాను మాత్రం బాగుంటే చాలనుకొనేవారు పరులు బాగుంటే ఓర్వలేక పోతారు. మనుజ జాతికే మచ్చ దెచ్చేవిధంగా మసలేవారెందరో ఉన్నారీలోకంలో కర్మసాక్షివైనా ఓ సూర్యదేవా! చూడవయ్యా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 94924 57262