Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిజాశంకరుల కల్యాణం

‘‘ఒకనాడిది తపోభూమి- శివుని ఆశ్రమమ్ము
శివుడొంటరిగానె నిచట చేసె దీర్ఘతపమ్ము

కళ్ళుమూయుటే యెరుగును- కళ్ళు తెరుచుటెరుగడు
కళ్ళుమూసి, కళ్ళు తెరచు- తెర్వు తెలియునతండు.

పర్వతమే పద్మాసనమేసి తపము సేసినట్లు
గగనమ్మే జటలు గట్టి తాపసియై పోయినట్లు.

సంద్రమె ఊపిరుల బిగిచి కుంభకమున దేలినట్లు
పంచాగ్నులె మనిషి రూపునంది తదము సల్పినట్లు.

వాయువెల్ల స్తంభించుచు కుదురుగ కూర్చున్నయట్లు
విశ్వమ్మే చలనముడిగి ధ్యానమ్మున మునిగినట్లు.

తపము సేసె శివుడు- సోహమ్మని-
జపము సేసె భవుడు
భృకుటిని తన- మనము నిల్పె- శివుడు!
మంత్రవౌచు- లోలోననె- లీనమందె శివుడు!

పర్వతాగ్రమున బుట్టిన నది సంద్రము జేరినట్లు
సంద్రమ్మున జేరిన నది ఒక ద్వీపము జుట్టినట్లు.

అట పార్వతి శివుని సేవ సేయసాగె సేవ చ
శివుని పతిగ బడసి తాను శివయై పోవుట కొరకు.

ఎన్నో దినములు గడిచెను- కాని ఆమె రాత్రమ్మే
ఎన్నో ఋతువులు గడిచెను- కాని ఆమె శిశిరమ్మే.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087