Others

యన్‌టిఆర్ గురుభక్తి (ఆనాటి హృదయాల.. )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరోజు లక్ష్మీ నిలయంలో కూర్చొని పెద్దాయన, చిన్నాయన.. అంటే యన్‌టి రామారావు, త్రివిక్రమరావులు సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారు. వారు మాట్లాడుకుంటున్నారంటే, అక్కడ మరెవరూ ఉండరు.
సినిమా నిర్మాణం ఎవరు చెయ్యాలన్నా కెవి రెడ్డి స్కూలు ఫాలో అవ్వాలి అంటారు యన్‌టిఆర్. ఆయన కెవి రెడ్డి భక్తుడు. ‘కెవి రెడ్డి షూటింగు స్క్రిప్ట్ చూస్తే అందులో సింగిల్ ఫ్రేమ్‌కూడా వృథా అనిపించదు. కథ ప్రారంభం నుంచి చివరివరకూ ఎక్కడా కథనంలో పట్టు సడలినట్టు అనిపించదు. పైగా షూటింగు స్పాట్‌లో కావలసిన ప్రాపర్టీస్- షాట్ డివిజన్ సైతం అన్నీ సిద్ధంగా ఉంటాయి బుక్‌లో. అలా వుండాలి నిర్మాణమంటే. ప్రొడక్షను వ్యవహారాలు చూసుకోవడం ఆషామాషీ కాదు’ అంటూ తమ్ముడితో ఏదో చెబుతున్నాడు.
ఇంతలో కెవి రెడ్డి వచ్చారు.
ఆయన్ని చూడగానే ‘గురువుగారూ! రండి. మీకు నూరేళ్ళాయుష్షు!’ అన్నాడు త్రివిక్రమరావు. రామారావుకి రెడ్డిగారంటే భయభక్తులు. వినమ్రంగా తలదించుకొని ఆయన మాట వినడమేగాని ఆయన ముందు చనువుగా మాట్లాడటం తెలీదు.
‘గురవుగారికి ఓ టీ!’ అని చెప్పి,
‘ఏదయినా పనిమీద వచ్చారా?’ అనడిగాడు యన్‌టిఆర్
‘అవునప్పా (ఇది ఆయన ఊత పదం). నీతో అవసరంపడే వచ్చాను. నీకు ఇబ్బందవుతుందేమో అని ఆలోచిస్తున్నాను’ అలవాటుగా కాలిమీద కాలు వేసుకున్నారు రెడ్డి.
‘మీ దయవలన నాకేఇబ్బందులూ లేవు. చెప్పండి’ అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు యన్‌టిఆర్.
రెడ్డిగారు టీ తాగాక..
‘రైట్- పిలగాడు (కుమారుడు) పై చదువుల కోసం అమెరికా వెళ్లాలంటున్నాడు. మరి అవేందో.. దాని కత ఏందో నాకంతా కొత్త. డబ్బులూ అంతంతమాత్రమేగా! ఒకసారి నిన్ను చూసి పోదామని వచ్చా. గురువుగారని పుణ్ణానికి చేయొద్దులే అప్పా. నీకో సినిమా చేసిపెట్టి బదులు తీర్చుకుంటా’ అన్నారు రెడ్డి.
రెడ్డిగారిదో తమాషా అలవాటు. అతని మనసు ఆనందంగా ఉందని ఎలా తెలుస్తుందంటే -కాలుమీద కాలు వేసుకుని, చొక్కాకి రెండుగుండీలు తీసి, కాలరు పైకెగరేస్తూ మెడ రుద్దుకోవడం. మొదట్లో ఈ అలవాటుని చూసి వింతగా ఫీలయ్యేది సావిత్రమ్మ కూడా.
త్రివిక్రమరావుగారికేదో పనుండి వెళ్లిపోయారు.
ఇంతలో ఉల్లిపాయ పకోడీలు వచ్చాయి. రెడ్డిగారి స్క్రిప్ట్, దర్శకత్వ ప్రతిభ, ట్రీట్‌మెంట్ ఇత్యాది విషయాలను పొగుడుతూ.. తన వ్యక్తిగతమైన అనుభవాల్ని రెడ్డిగారితో పంచుకున్నారు.
ఒక అరగంట కాలక్షేపం జరిగింది.
యన్‌టిఆర్ దగ్గర్నుండి ఎటువంటి సమాధానం రాలేదు.
‘సరే, నేనొస్తానప్పా’ అంటూ బయల్దేరబోయాడు.
‘చాలా సంతోషం గురువుగారూ. ఈ వయసులో మీరెక్కువ శ్రమపడకండి. మీకేం కావలసినా మేమున్నాంగా’ అంటూ చేతులు జోడించి నమస్కరించాడు.
ఇక్కడ జరిగిందేవిటంటే అంతకుమించి కెవి రెడ్డీ అడగలేదు. యన్టీఆర్ చెప్పలేదు. గురువుగారిక్కావలసిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. సమృద్ధిగా అన్నదమ్ములిద్దరి మధ్యా అంత మంచి అండర్‌స్టాండింగ్ ఉండేది. అంత గుంభనంగా తన శిష్యుడు స్పందించినందుకు ఉప్పొంగిపోయాడు రెడ్డిగారు.
గురువుగారు మాత్రం తక్కువ తిన్నారా?
‘శ్రీకృష్ణసత్య’ చిత్రానికి దర్శకత్వం వహించి తను అన్నమాట ప్రకారం బదులు తీర్చుకున్నాడు.

-ఇమంది రామారావు 9010133844