Others

నీరాజనం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సినిమా ఒక ప్రేమకథా చిత్రం. ఇందులో ప్రేమ జంటగా విశ్వా- శరణ్యలది తొలి పరిచయమైతే -బాలీవుడ్‌లో స్థిర పరిచితుడు, స్థితప్రజ్ఞుడు అయన ఓపీ నయ్యర్ -తెలుగుకు చేసిన ఓకే ఒక్క చిత్రమిది.
ఈ ప్రేమ కథకు జీవం జవం సంగీతమే. అంచేత ఇది ఒక సంగీత ప్రధాన చిత్రంగా ప్రేక్షకుల మన్ననలందుకుంది.
ఇందు ఒక్కొక్క పాట ఒక్కో తరహాగా సాగుతూ సినీ ప్రేక్షకుల హృదయాలను రంజిల్లచేసింది అనటం ఎంతో సముచితమైన భావనగా భావిస్తున్నాను.
కథ, కథనం.. ఆచార్య ఆత్రేయ సంభాషణలపై నడుస్తూ, పాటలకందిబుచ్చుకున్నట్టు కనెక్టవుతూ సుఖంతో మొదలైన కథ అంత్యానికి విషాదంతో ముగుస్తుంది. ఇది ప్రేమకథే అయినప్పటికీ కొంత వినూతనత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అయితే ఈ చిత్రం ఓ దృశ్యకావ్యం, సంగీత భరితం, సాహితీ సౌరభం. వీటికి కలాలు ఝుళిపించి ప్రేక్షకులను రసజగతిలో విహరింపచేసిన సినీకవులు ఆచార్య ఆత్రేయ, సి నారాయణరెడ్డి, వెనె్నలకంటి, ఎమ్‌ఎస్ రామారావులు. అవ్వారి సాహితీ సౌరభాలకి... చక్కటి మధుర మంజుల సుస్వరాలు పొదిగి, అంతే వాసితో గంధర్వ గానమా, సుస్వర నాధమా అనిపించేలా ఎలకోయిల ఎస్ జానకి, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు... చక్కటి జిగిబిగి వాద్యాలతో సినీ ప్రేక్షకుల మనసులలోకి చొప్పించారు సుప్రసిద్ధ బాలీవుడ్ సంగీత సామ్రాట్ ఓపి నయ్యర్.
ఈ ఘనత, ఖ్యాతి ఉత్తమాభిరుచిగల నిర్మాత ఆర్‌వి రమణమూర్తి, అశోక్‌కుమార్‌కు చెందుతుంది. ఈ చిత్రానికి పాత్రోచితంగా వ్యవహరించిన జెవి సోమయాజులు, శరత్‌బాబు, రాజ్యలక్ష్మీ మరియు నర్తకీమణి కుయిలీకి పై ప్రశంసలలో భాగం దక్కుతుంది. తెరమీద కథానాయిక, నాయకులు కొత్తవారైనా అనుభవం కలవారిగానే అనిపించారు, కనిపించారు.
ఈ చిత్రం ఆర్థికంగా ఆశించినంత విజయం సాధించకన్నా, రెండు నందులను కైవశం చేసుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఓపి నయ్యర్ ఖాతాలోకి, ఉత్తమ సహాయ పాత్రధారిగా శరత్‌బాబు ఖాతాకి.
అందుకే ఈ సినిమా నాకెంతో ఇష్టం.