Others

ఏకప్రాస బాసర సరస్వతీ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా. నీ మాయామయమైన రుూ ప్రకృతినే నిత్యమ్ముగా నెంచి చే
తో మూఢత్వము చేత కొందరును యేదోలెమ్ము పోనిమ్ముగా
నీ మాకెందుకటంచు కొందరును తల్లీ కర్మబంధమ్ములన్
తామే యాత్మకు అల్లుకొందురుగదా తన్మూలమున్ గానకన్

శ్రీ మహావిష్ణువున కా మహాలక్ష్మి
ఆ మహాదేవున కర్థాంగి శర్వాణి
బ్రహ్మదేవుని రాణి వాణి వీణాపాణి
ముగురమ్మలకు నీవు మూలంపుటమ్మవే
నీదు పాదాలనే పాదుగా జేసుకొని
అల్లకొంటిని తల్లి! మనసుమల్లియ తీగ
తాపాల వడగాలి పాపాల సుడిగాలి
వీచు చున్నది వేగ కాచి రక్షించవే

బాలుడను పాపాల భైరవుడ నేను
దురిత జాలమునందు దుఃఖించుచుంటి
కనికరమ్మును జూపి కన్నీరు తుడిచి
నీ ఉమాపతి సుతుని యేలుకోవమ్మ

-ఉమాపతి శర్మ 9246171342