Others

ప్రణతోస్మి ప్రభాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదవరాని గానరు పెద్దవారు
కాస్త దయఁ జూపరేమి రుూ కాలమందు
బండబారిన మనసులు నిండె జగతిఁ
జూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!
భావం:డబ్బున్న పెద్దవారి దృష్టికి పేదవారు రారు. కాస్తంతైనా వారిపైన జాలి చూపరు. బండబారిన మనసులుకల్గిన మనుషులతో ఈ జగమంతా నిండిపోతోంది చూడవయ్య ఓ సూర్యదేవ!
తరతరాలకు సరిపడు ధనముగూడ
బెట్టి యుం దృప్తిచెందక మట్టిఁ గలియు
వరకు ధనమునకై యాశ పడుచుదురకట!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: తరతరాలకు సరిపడు ధనాన్ని కూడ బెట్టికూడా తృప్తి చెందకుండా చచ్చేవరకు ధనానికై ఆశపడుతున్నారయ్యో కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్య ఈ అన్యాయం.
కార్లు మార్చిన వాడెపో ఘనుడ నేడు
వస్త్ర వైశేష్యములు గట్టు వాడె ఘనుడు
బంగళాలందు నివసించువాడె వేల్పు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: అనేక పర్యాయాలు కార్లను మార్చేవాడు విలువైన వస్తధ్రారణ చేసేవాడు నేటికాలంలో గొప్పవాడు. బంగళాల్లో నివసించేవాడిని దేవుడుగా భావిస్తారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా చూడవయ్య!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం