Others

ఇంట్లోంచి వాటిని తరమండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది మహిళలకు ఎలుకలన్నా, సాలెపురుగులన్నా, బల్లులన్నా చాలా భయం. ఇంట్లో వాటి ఉనికిని కూడా ద్వేషిస్తారు. ఈ జీవులు ఇంటిని ఇబ్బందికరంగా మార్చేయటమే కాకుండా, అనేక రకాల వ్యాధుల వ్యాప్తికి కూడా కారణమవుతాయి. వీటిని వదిలించుకోవడం చాలా కష్టమైన పని. ఇవి ఒకసారి ఇంట్లోని వెచ్చదనానికి, సౌకర్యానికి అలవాటు పడ్డాక ఇంటిని వదలి వెళ్లవు. ఇంటి నలుమూలల్లో కాపురాలు పెట్టి వాటి సంతానాన్ని దినదిన ప్రవర్ధమానం చేసుకుంటాయి. కాబట్టి వీటిని వీలైనంత త్వరగా.. అంటే ఒకటి కనిపించగానే పారద్రోలడానికి ప్రయత్నించాలి.
* వీటికి కంటిచూపు తక్కువైనా వీటి ఆఘ్రాణ శక్తి అమోఘం. కాబట్టి వాటిని పారద్రోలే మందులను తెచ్చి అవి తిరిగే ప్రదేశంలో ఉంచితే అవి వెళ్లిపోతాయి.
* కోడిగుడ్డు పెంకు: కోడిగుడ్డు పెంకులను బల్లులు తిరిగేచోట ఉంచినట్లయితే బల్లులు ఇంట్లో ఉండలేవు.
* టీ సంచులు: ఒక గినె్నలో వేడినీరు తీసుకుని అందులో మూడు నుండి నాలుగు టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఈ వాసనకు సాలీడులు, ఎలుకలు దూరంగా పారిపోతాయి. ఇవి తిరుగుతున్నాయి అనే స్థలాల్లో టీ బ్యాగులను ముఖ్యంగా పిప్పెరమెంట్ టీ బ్యాగులను ఉంచాలి.
* బిర్యానీ ఆకులు: భారతీయ మసాలా వంటల్లో విరివిగా వాడే బిర్యానీ ఆకుల వాసన, రుచి తెలియనివారు చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఇదే వాసన ఎలుకలు, సాలెపురుగుల పనిపట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ జీవులు నివశించే ప్రాంతాల్లో ఉంచాలి. బిర్యానీ ఆకుల బలమైన వాసన వీటిని బయటకు పరుగులు పెట్టిస్తుంది.
* మింట్ టూత్‌పేస్ట్: ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించే మార్గాన్ని గుర్తించగలిగితే ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిలో చేయాల్సిందల్లా అది ప్రవేశించే రంధ్రాన్ని పూడ్చేసి చాలా ఎక్కువ పరిమాణంలో టూత్‌పేస్ట్‌ను అద్దాలి. అంతేకాకుండా ఇంట్లోని బీరువాలు, అలమారాల్లో దిగువన కొంచెం పేస్ట్ రుద్దితే.. ఇది ఎలుకల పని పడుతుంది. సాలెపురుగులు సాధారణంగా ఇంటి మూలల్లో, తలుపులు, కిటికీల వద్ద గూడుకడతాయి. ఆ ప్రాంతాల్లో కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాస్తే అవి గూళ్లు కట్టవు.
* వంటసోడా: ఎలుకలు, సాలెపురుగులు వదిలించుకోవడానికి వాడే సురక్షితమైన మార్గాల్లో ఇది ఒకటి. సాలెగూళ్లు ఏర్పడే ప్రాంతాల్లో వంటసోడాను చల్లాలి. ఆ వాసనకు సాలెగూళ్లు పెరగకుండా ఉంటాయి. *