Others

తేలికపాటి ఆహారమే మేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలంలో డీహైడ్రేషన్ అందరినీ వేధిస్తుంది. చలువ చేసే పదార్థాలు ఎన్ని తీసుకున్నా శరీరంలో వేడి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇలాంటప్పుడు తప్పనిసరిగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
* వేసవికాలంలో నూనె వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, చిప్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల వేళ వీటి జోలికి వెళ్లకూడదు.
* రోజువారీ తీసుకునే కారం, మసాలాలు శరీరంలో వేడిని పెంచి జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి. కాబట్టి ఈకాలంలో చలువ చేసే పదార్థాలను ఎంచుకోవాలి.
* ఈకాలంలో మాంసాహారం అతిగా తినకూడదు. చికెన్, మటన్ వంటివి జీర్ణ సంబంధ సమస్యల్ని పెంచుతాయి. ఫలితంగా విరేచనాలు, బద్ధకం వంటివి తలెత్తుతాయి.
* వేసవిలో డీహైడ్రేషన్ ఇబ్బంది పెడుతుంది. నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ కాఫీ, టీలు తగ్గించుకోవాలి. అతిగా తీసుకోవడం వల్ల నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. శరీరం కూడా తేమని కోల్పోతుంది.
* జంక్‌ఫుడ్ కూడా మంచిదికాదు. ఇందులో అధికంగా కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. పైగా పొట్టలో గ్యాస్ పేరుకుని ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వేసవికాలంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.