Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూవువింటి దొర యట్టుల బూడిదకుప్పగ మారెను
కలువపూల కలికి కలిమి బూడిదపాలై పోయెను.

ఆ కుప్పను దొరలి దొరలి, పొరలి పొరలి ఏడ్చెను
ఒక శశియే నభము వీడి పొరలెననగ పొరలెను.

అగ్గి కన్ను మూసి శివుడు చలువ కనుల తెరచె
పూల పూసినటుల కనులు పూచె చూపు వీచె.

‘‘ఇది ఏమిటి? ఏమి జరిగె? ఎవని బూది సేసినాను?
నా కడుపునె నేనిట్టుల చిచ్చు బెట్టుకొనినాడను?

మేలు కోరువానికి నే కీడెట్టుల నొనరించిని?
మేలేదో, కీడేదో కనుగానక- కనుగాల్చితి.

కనులున్నవి కాల్చుటకో? తపమన్నది మాడ్చుటకో?
కొడుకన్నది కూల్చుటకో? జరిగె నిటుల నెందులకో?

ఎవని దూరి ఏమున్నది? నీ బతుకిటులైనది!
ఏ జన్మను ఏ కర్మమొ? కొడుకా! నీకిటులైనది!’’

అని రుద్రుండేడ్చెను- నిప్పు కంట నీరు కురిసె!
అని దొరలెను శివుడు- సృష్టి సుడులు తిరిగె!

తనవాడే వీడంచును- తనను వీడె వీడటంచు
తన తనువును తనకిడుచును- తా ననంగుడాయెనంచు.

దోసిలించి వాని బూది- కనులకద్దు కొనెను
తలపైనను చల్లుకొనెను- మేనబులుము కొనెను.

బూది ప్రోవె లేచెననగ- లేచెనపుడు శివుడు
- ఇంకాఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087