Others

చౌరస్తాలో పెద్దపులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ చౌరస్తాలో
మేకవొకటి ఎదుగుతున్నది
ఈ కాంక్రీటు వనంలో
ఆ నాలుగు కాళ్ళ అమాయకత్వం
మేత వెతుకుతున్నది
కదిలే ఆ మాంసంపై ఎన్ని దొంగ చూపులున్నాయో
ఇంకెన్ని కళ్ళు లొట్టలేసుకుని చూస్తున్నాయో
ఆ క్రూరజంతువు ఎటూ తప్పిపోకుండా
ఏ కనుచూపు కంచె కాపు గాస్తున్నదో..

అది మేషం అంటే ఒప్పుకోనే్నను
పకోడీ పొట్లం తెరిచినట్టు
పచ్చపచ్చని ఆకుకూరలతో నోరూరిస్తున్న
ఆ కూరగాయల దుకాణంలో తలదూర్చినందుకు
లాభనష్టాల బేరగాడు కట్టె అందుకుంటే
వీపు కమిలిన మోపెడు దుఃఖం

కుండీలు చిగురించినట్టు
ఈ షాపు ముందున్న
పసరు పసరు మొక్కలపై ప్రాణం లాగుతుంటే
ఆ మొక్కల ప్రేమికుడు
ఆ పచ్చందాల ప్రియుడు
గజేంద్ర మోక్షం విష్ణుమూర్తిలా
పరుగు పరుగునొచ్చి కసురుకుంటే
గుప్పెడు ఆకలి తీరని కొండంత నిట్టూర్పు
పూలపల్లకిలా ముస్తాబయన
ఆ నాలుగు పయ్యల బండిపైనున్న పూల రాశులలోంచి
బుక్కెడు మకరందపు రెమ్మలు అందుకునే బ్రతుకు యుద్ధాన
గుచ్చుకొన్న గులాబీ ముల్లులా
పూలు దండ గుచ్చుతున్న ఆ పూలరాణి పొడిచిన సూది పదును
నెత్తుటి తిలకమయన పొట్టతిప్పల పోరాటంలో

ఆ పండ్ల బండివైపు
పండు తిని తొక్కపడేసే వాళ్ళ కోసం
ఎదురు చూసి చూసి
ఆ వ్యాపారి చేత తన్నులు తిన్న
గత అనుభవం మరిచిపోయ
కడుపున బకాసురుడు నిద్రలేచినట్టు
తియ్యతియ్యగా వేల్లాడుతున్న
అరటిగెలల రథంపైకి
ఎగబడుతున్న పేగు మాడిన ఉద్యమం

అది మేక అంటే నేనొప్పుకోను
ఖాళీ కడుపు పూరించిన సమర శంఖారావం
తనది కాని సమూహంలో
తిరగబడుతున్న పెద్దపులి అవతారం

కడుపు కాలుతున్న సమాజంలో
ఎదురు తిరగడం నేర్వాల్సిన పాఠం

- గజ్జెల రామకృష్ణ, 8977412795