Others

మానవ జన్మ రావడం దుర్లభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధాత 84 లక్షల జీవరాశులను సృష్టించిన ఈ సృష్టిలో మానవ జన్మ మిక్కిలి శ్రేష్ఠమైనది. 84 లక్షల జీవరాశులనగా ఆవు ఒక్కటి, ఎద్దు ఒకటి, జింక ఒకటి, గొర్రె ఒకటి, చీమ ఒకటి మొదలైనవి. వీటిలో ఒక్కొక్క జంతువు క్రింద లక్షలాది జంతువులుద్భవిస్తాయి. ఇప్పటి మానవుని క్రింద పృధ్విలో 750 కోట్ల మానవులు (సుమారు) ఉన్నారు. ద్రవిడ భాషలో తిరువాసకమనెడి శాస్త్ర ప్రమాణ రీత్యా ఎల్ల మానవులు మొదట పచ్చిగడ్డిగా వుండి, ఆ జన్మ పుణ్య విశేషము చేత గడ్డిలోని పూతగా, మరల వృక్షములై, మరలా రాయియై, పిదప ప్రాకుడు జంతువులుగా, మృగాలుగా, తర్వాత పుణ్యమువలన మానవ శరీరమునెత్తి స్ర్తి, పురుషులుగా పుట్టుచున్నారు. లక్షల కోట్ల (లెక్కపెట్టలేనన్ని) జీవరాశులతో పోలిస్తే మానవ సంఖ్య 0.000000001 కూడా వుండదు.
వివేక చూడామణిలో శ్రీ శంకర భగవత్పాదులవారు ‘జంతూనాం నరజన్మ దుర్లభం’ అంటారు. వారే మానవ జన్మ, మహాపురుష సంశ్రయము, ముముక్షత్వం, శతకోటి జన్మల ఫలంగా లభిస్తుంది అంటారు. జంతువులకు ప్రారబ్దానుభవము తప్ప పాప పుణ్యాలంటవు. కాని వాటికి పుణ్య విశేషము దైవానుగ్రహమువలననే మానవజన్మ లభ్యమవుతుంది. తెనాలి రామకృష్ణుడు వ్రాసిన ‘పాండురంగ మహాత్మ్య ప్రబంధము’లో ‘సుశీలోపాఖ్యానము’ వస్తుంది. పూర్వజన్మలో సుశీలది ఆవుజన్మ. శ్రీకృష్ణ్భగవానుని వేణుగానము విని పరవశయైన ఆ ధేనువు క్షీరము స్రవించగా ఆ నురుగు, గాలి వేగంగా వీచడంవలన శ్రీకృష్ణ పరమాత్మ నెమలి ఫించనము మీద పడుటవలన ఆమెకు మానవ జన్మ వచ్చింది.
మన సనాతన ధర్మంలో ఋషుల తపః ఫలితంగా, మరణానంతరము జీవ ప్రయాణము (ఆరోహణమార్గము) మరల భూమికి చేరువరకు (అవరోహణం), జీవుని కష్టాలు వివరించారు. జీవుడు శరీర నిష్క్రమణ (ఉత్క్రాంతి) అయిన వెంటనే అతని ప్రయాణానికి రెండే దారులు. వేరే దారి లేదు. 1. అర్చిరాది మార్గము లేక దేవయాన మార్గము 2. ధూమమార్గము లేక పితృయాన మార్గము. మూడవ మార్గము అతి నీచమైనది. వారు సూకర యోనులలో, క్రిమికీటకాదులుగా జన్మిస్తారు. శ్రుతియందు ఊరక చూపినారు. మొదటి మార్గము జ్ఞానులు, బ్రహ్మోపాసకులు, పరమేశ్వరుని ధ్యానించువారు ఈ మార్గమున తేజో అభిమాన దేవత, శుక్లపక్ష అభిమాన దేవత, సంవత్సర అభిమాన దేవతల లోకములనుండి సూర్యలోకం, పిమ్మట చంద్రలోకం చేరుదురు. భూలోకమున మరలా జన్మించువారు మాత్రము చంద్రలోకం నుండి మేఘమును చేరుదురు. కాని పునరావృత్తి లేనివారు అట్లుదిగక, బ్రహ్మలోక ప్రయాణము చేయదురు.
రెండవమార్గము చాందోగ్యోపనిషత్తులో ‘పంచాగ్ని విద్య’ ద్వారా వివరించబడింది. శే్వత కేతువును వటుడు గురుకుల విద్యాభ్యాసమైన తర్వాత ‘ప్రవహణుడ’ను రాజును కలుస్తాడు. రాజు అతనిని ఐదు ప్రశ్నలడుగుతాడు. తన తండ్రి ఈ ప్రశ్నలనడిగితే తనకూ తెలియదని, ఇద్దరూ, రాజును ఈ విద్యను బోధించమని ఆశ్రయిస్తారు. రాజు వాళ్ళిద్దరకు పంచాగ్ని క్రమము తెలుపుతాడు.
పంచాగ్నులు: 1.ద్యులోకము (స్వర్గ) 2.పర్జన్య 3. పృథివి 4.స్ర్తి 5.పురుషుడు.
వీటిని అగ్నిస్వరూపంగా భావించి పరమాత్మ ఉపాసన చేయాలని చెబుతాడు.
ఆరోహణక్రమం:దానధర్మాలు, యజ్ఞయాగాదులు, వ్రతాలు చేయువారిని ఇష్టాదికారులు అంటారు. క్షీర, ఘృతాది రూపములగు పాంచ భౌతిక పదార్థములను అగ్నిహోత్రమునందు హోమము చేయుచున్నాడు. ఆ హోమద్రవ్యములు సూక్ష్మరూపములై అపూర్వమను పేర పురుషుని ఆశ్రయించి వాని నిర్గమన కాలమున వానిని ఆశ్రయించే ఆ జీవుని ఆకసమునకు తీసికొనిపోవును. అక్కడినుండి చంద్రలోకమునకు పోవును. అక్కడ సకల భోగాలు అనుభవించి, తిరిగి భూలోకంలో ఉత్తమ జన్మలు పొందుతారు. గీత జ్ఞాన యోగంలో యజ్ఞమును గురించి చెప్పారు. ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, సాధ్వాయన యజ్ఞము. జనులు వారి వారి సంస్కారములను పట్టి, ఏదో ఒక యజ్ఞము చేసి దాని ప్రసాదము స్వీకరించిన కనీసం చంద్రలోక ప్రాప్తి కలిగి భవిష్యత్తులో ఉత్తమ జన్మలు వస్తాయి.
ఇక అవరోహణక్రమము జీవుడు చంద్రలోక భోగాలు అనుభవించిన తర్వాత తిరిగి భూలోకానికి వచ్చేటప్పుడు ఆకాశాన్ని, ఆకాశమునుండి వాయువును, వాయువునుండి ధూమమై (పొగ), ఆ ధూమము అభ్రమై (అవరోహణదిశ), ఆ అభ్రము మేఘమై వర్షిస్తుంది. అచటనుండి వర్షమూలమున భూమిని ఆశ్రయిస్తుంది. ఇంతవరకు ఆయా స్థానములందు విశేషముగ నిలుపవలసిన పనియుండదు. అవరోహణలో జీవుడు వర్షాధారమెక్కడ పడునో దానిని ఆశ్రయిస్తాడు.
ఆహార పదార్థము నాశ్రయించుట జీవుని మొదటి కష్టము. వర్షాధారము నది మధ్యలో పడిన అది సముద్రములో కలియును. సూర్యకిరణములచే అందలి జలములు పీల్చిన మరల మేఘమండలము చేరును. వర్షాధారము ఏ రాతిమీద బడినా, ఆహారమునకు ఉపయోగపడని వృక్షముపై పడినా ఉపయోగముండదు. ఆహారము భుజించువాడు, వనవంతడు, శుక్లదోషాలు లేనివాడుగా ఉండవలెను.
తాత పుట్టాడు, తండ్రి పుట్టాడు, అవ్వ పుట్టింది- ఇదంతా హుళక్కే. భర్తృహరి సుభాషితం- ఆహారం, నిద్ర, భయం, మైథునం, జంతువులకు, నరులకు సమానం. దీనిని సరైనరీతిలో ప్రచోదయము చేసుకొని మానవ జన్మ సార్థకము చేసుకొని దైవ సాన్నిధ్యము చేరుకొందాము.

-కె.రఘునాథ్