Others

పరిణతి లేని రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసింది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వమే దిమ్మతిరిగే మెజారిటీతో వచ్చింది. కాని మన ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఊహించని దెబ్బ తగిలింది. సరే ఎన్నికలన్న తరువాత కొన్ని ఊహించిన, మరికొన్ని ఊహాతీతమైన విషయాలు జరుగుతాయి. వాటిని భరించటం, అనుభవించటం తప్ప ప్రస్తుతానికి నాయకులు, ప్రజలు చేయగలిగిందేమీ లేదు. కాని ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఖర్చుపెట్టవలసి వచ్చిన వ్యయానికి సంబంధించిన లెక్కలు మట్టుకు మనకు దిమ్మతిరిగేట్లు చేశాయి. రానురానూ ఓట్ల పండుగ ప్రజాస్వామ్య ఉత్సవంగా కాక, ధనబల ప్రదర్శనగా మారిపోయింది. మరీ ముఖ్యంగా 2004 ఎన్నికల నుంచి ప్రచారంపై ఓట్ల సమీకరణపై చేసిన ఖర్చు, అంతకుముందు ఎన్నికల్లో చేసిన ఖర్చును ఎన్నోరెట్లు మించిపోయింది. మరి లోక్‌సభ కోటీశ్వరుల అడ్డాగా మారిందంటే ఆశ్చర్యమేముంది? 2004లో ఎన్నికల్లో పోటీ చేసిన సంపన్నులు 30 శాతంగా, 2009లో 50 శాతంగా, 2014లో 83 శాతానికి పెరిగిపోయిందని ఎ.డి.ఆర్. అనే సంస్థ తెలిపింది.
ప్రజాస్వామ్య భారతంలో మొదట్లో సామాన్య అభ్యర్థులు కూడా సంపన్న పారిశ్రామికవేత్తలను ఓడించిన చరిత్ర ఉంది. 1971లో దక్షిణ బొంబాయి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన పారిశ్రామికాధిపతి నావల్ టాటా (రతన్ టాటా తండ్రి) అనామక కాంగ్రెస్ అభ్యర్థి అయిన కైలాస్ నారాయణ్ చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడా పరిస్థితి ఊహించలేం. ఏతావతా భారత్‌లో ఎన్నికల ప్రక్రియ క్రమంగా భ్రష్టుపట్టిపోతుందంటే అతిశయోక్తి కాదు.
తరుణోపాయమేమిటి...?
నా ఆలోచనలో- ఎన్నికలలో రాజకీయ పార్టీలే పోటీచేయాలి.. అభ్యర్థులు కారు. ఎవరైనా, ఎక్కడనుంచైనా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయవచ్చు. గెలిచిన రాజకీయ పార్టీ నిర్ణీత సమయంలో తమ ఎం.ఎల్.ఎలను ప్రకటించాలి. అదీ తాము గెలిచిన నియోజకవర్గాలకే సుమా! ఆ ఎం.ఎల్.ఎలు కూడా ఆ జిల్లానుంచే ఉండాలి. గెలిచిన స్వతంత్ర అభ్యర్థులంతా ఇష్టమైతే తామంతా కూడి ఇంకో నూతన పక్షాన్ని ఏర్పరుచుకోవచ్చు! మొన్నటి ఎన్నికల సమయంలో ఎంత నగదు, ఎంత మద్యం, ఎంత విలువగల మాదకద్రవ్యాలు, బంగారం, వెండి, ఉచిత కానుకలు పట్టుబడ్డాయో కచ్చితంగా చెప్పలేం. వాటి మొత్తం విలువ రూ. 3483.75 కోట్లని ఓ అంచనా.
సాక్షాత్తూ మన ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు మన ఎన్నికల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మానేజిమెంట్ అసోసియేషన్ 46వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం లెజిస్లేచర్లు దాదాపుగా పనిచేయటం లేదనీ, ఇక ఈ సభ్యులను గళష్ఘ యచి ళజఒ్ఘఆఖూళఒ అనే ఉధ్యమంగా తయారవుతుందేమో అన్నారు. (ని ఘౄ ఘచ్ఘిజజూ ఆ్ద్ఘఆ తీళ ఘూళ య్పౄజశ ఆ్యత్ఘీజూఒ ఆ్ద్ఘఆ ఒఆ్ఘ్ళ తీళ త్ఘీశళజూ) తాను రాజ్యసభ అధ్యక్షుడిగా- శ్యఆ్ఘఆజ్యశ యచి ఘశఆజ జూళచిళషఆజ్పళ ఘతీఒ విషయంలో న్యాయబద్ధంగా ఉండాలని ఆశించానన్నారు. అట్లాంటి వ్యవహారాలు అత్యంత శీఘ్రంగా పరిష్కరింపబడాలన్నారు.
ఎలక్షన్ పిటిషన్లు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఉన్న క్రిమినల్ కేసులు-హైకోర్టుల్లోని స్పెషల్ బెంచీల ద్వారా 6 నెలలు లేదా సంవత్సరంలోగా పరిష్కరింపబడాలన్నారు. అలాగే లెజిస్లేచర్ల అధ్యక్షులు- ఈ డిఫెక్షన్ కేసులు 3 నెలల్లో పరిష్కరింపబడాలని ఉప రాష్టప్రతి అన్నారు. వెంకయ్య నాయుడు ఇంత బహిరంగంగా తన అభిప్రాయాలను ఇంతకు ముందెన్నడూ వెల్లడించలేదు. ఎన్నికల్లో సంస్కరణలపై ఆయన చెప్పిన మాటలు అందరికీ ఆచరణీయం.
నాయకుల సంస్కారం...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు- దేశమంతా దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ‘మోదీని ఓడించండి’ అన్న నినాదంతో పర్యటించిన సంగతి అందరికీ తెలుసుగదా! ముఖ్యంగా బెంగాల్ విషయంలో ఆయన ధోరణి ఎవరికైనా ఆశ్చర్యం కలుగచేస్తుంది. మోదీని మహిషాసురుడిగా, మమతా బెనర్జీని దుర్గగాను ఆయన అభివర్ణించారు. ఢిల్లీ మహిషాసురుడిని బెంగాల్ దుర్గ ఓడించాలనీ, దేశంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలనీ ఆకాంక్షించారు. ఇంకా చంద్రబాబు ప్రసంగం చేస్తూ- ‘కోల్‌కత నగరం ఫుట్‌బాల్ ఆటకు ప్రసిద్ధి. ఇప్పుడు బంతి మన కోర్టులో ఉంది. భాజపాను ఫుత్‌బాల్ ఆడాల్సిందే. మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. మతతత్వ భాజపాను తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. మోదీజీ.. మీతో 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎం.ఎల్.ఎలు టచ్‌లో ఉన్నారని అంటారా? మాకు 110 కోట్ల దేశ ప్రజలు టచ్‌లో ఉన్నారు..’ అని అన్నారు. దీన్ని ఏమందాం? ఇది సంస్కారమా? దేశ ప్రధానిని మహిషాసురుడని అనటం ఒక ప్రముఖ రాజకీయవేత్తకు, ముఖ్యమంత్రికి తగునా?
ఎన్నికల తరువాత బెంగాల్‌లో పరిస్థితులేమిటి? ఎన్నికల్లో గెలిచిన 18 మంది భాజపా ఎంపీలు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి కైలాస్ విజయవర్గీయ, దిలీప్ ఘోష్, ముకుల్‌రాయ్ సహా ఇతర బిజెపి నేతలు కలకత్తాలో తీసిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. మమత సర్కార్‌కు వ్యితిరేకంగా నినదిస్తున్న బిజెపి శ్రేణులపై లాఠీలు విరిగాయి, బాష్పవాయు ప్రయోగం జరిగింది. బెంగాల్ ఎన్నికల్లో భాజపా సాధించిన అపూర్వ విజయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 2014లో 2 సీట్లు, 17.43 శాతం ఓట్లుమాత్రమే పొందిన బిజెపి వారు 2019లో 18 సీట్లు, 40 శాతం ఓట్ షేర్‌ను సాధించారు. ఒకటి మాత్రం తథ్యం... ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెంగాల్ వెళ్లరు... ఇక బెంగాల్ గతం... స్వామి రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానందులు, మహాయోగి అరవిందులు ప్రపంచ ప్రసిద్ధి పొందారు. దివంగత డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏ పార్టీ వ్యక్తి? గతం మనకు అవసరం లేదు. గతంతో సంబంధం లేని వర్తమానమే కావాలి? ఇదా మన రాజకీయ నీతి, పరిణతి, మన సంస్కారం?

-చాణక్య