Others

‘ఓమ్’ కారమే ఓంకారేశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=============================================================
ఒక్కొక్క శక్తి కేంద్రమునకు ఒక్కొక్క బీజాక్షరము (లేక వర్ణము లేక శబ్దము) ఆధిపత్యము వహించును. అట్టి బీజాక్షర ఉచ్ఛారణ చేత, సంబంధిత నాడీ మండలము ప్రచోదనము చెందును. ఆ కారణముచే ఆ భాగము చైతన్యవంతమై ఆరోగ్యమును పొందును. ఆ విధముగా ఏకాగ్ర చిత్తముతో చేసిన మంత్రోపాసనచే, రోగములను తగ్గించుకొను అవకాశము కలదు. అందుచేతనే మన ప్రాచీన ఋషులు, యోగులు, వేదములు, ఉపనిషత్తులు, పురాణేతి హాసములు అనేకానేక మంత్ర భాగములను కనకందించారు. ఇట్టి మంత్రములు ఏకాక్షరములుగాను, పదములుగాను, స్తోత్రములుగాను మనకివ్వబడినవి. వీనియందు బీజాక్షరములొక క్రమపద్ధతిలో పొందుపరిచి తయారుచేయబడినవి. ఒక్కొక్క మంత్రమునకు విడివిడిగా ఫలితం ప్రయోజనము నిర్దేశించబడినవి. ఇట్టి మంత్రములు మన మనోమయ కోశమునందొక నూతన చైతన్యము కలిగించును. ఈ విధముగా సమకూర్చబడిన వాటిలో కొన్ని ముఖ్యమైనవిగా చెప్పబడినవి. వేదమునందలి ‘శ్రీసూక్తము’ ‘పురుషసూక్తము’ ‘రుద్రసూక్తము’ మొదలగునవి. శ్రీమద్రామాయణము నందలి ‘ఆదిత్య హృదయ స్తోత్రము’ శ్రీమద్మహాభారము నందలి ‘విష్ణుసహస్రనామములు’ బ్రహ్మాండ పురాణమునందలి ‘శ్రీలలితా సహస్రనామ స్తోత్రము’ మొదలగునవెన్నియో కలవు. వీటిని ఏకాగ్రతతో చదివినవారికి ఈప్సితార్థములు నెరవేరునని చెప్పబడినది.
మంత్రములో కొన్ని ముఖ్యమైన వాటిని కొద్దిగా పరిశీలిద్దాం. ‘ఓం’ దీనిని ఏకాక్షర బ్రహ్మమనికూడా అంటారు. శ్రీలలితా సహస్రనామాలలో ‘ఓజోవత్యై నమః’ (767వ నామం) అనే నామంలోని ఓజస్సు ‘ఓం’ అనే దాని నుండి పుట్టేది. దానిని పుట్టించేది కావున, ఈ ధాతువునాకా పేరు వచ్చిందంటారు పెద్దలు. దీనిని మన శరీరంలో, ‘అష్టమధాతువు’ అని కూడా చెప్పారు. ఈ ధాతువు తగ్గితే జ్ఞాపకశక్తికూడా తగ్గిపోతుంది.
‘ఓం’ ప్రధాన బీజాక్షరము. ఇది అకార + ఉకార +మకారముల కలయికచే ఏర్పడింది. దీనిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనియు త్రిగుణముల సంయమమునకు మంత్రముగా చెప్పబడినది. ఈ ఓంకారము, జీవునియందు తాను, లేక నేనుగా వ్యక్తమగునుట్టి అంతర్యామి ప్రజ్ఞగా చెప్పబడినది.
ఒక మిత్రుడు నన్ను పంచాక్షరి మంత్రంలో ఆరు అక్షరాలున్నాయి కదా (ఓం, న, మ, శి, వా, య) మరి పంచాక్షరి ఎట్లా అయింది అని ప్రశ్నించాడు. ఇచట మంత్రమునకు ముందు ‘ఓం’కారము చేర్చబడినది. ‘ఓం నమః శివాయ’ పంచాక్షరి మంత్రంలో-
‘న’ అంటే నభస్సు అనగా ఆకాశము
‘మ’ అంటే మరుత్, అనగా వాయువు
‘శి’ అంటే శిభి అనగా అగ్ని
‘వా’ అంటే వారి అనగా జలము
‘య’ అంటే యజ్ఞమునకు ఆలంబనమైన భూమి ఈ ఐదును పంచభూతాలు. వీటికి ముందుండిన ‘ఓం’కారమే శివపరమాత్మ (ఓంకారేశ్వరుడు)యై యున్నాడు. ఈ పంచభూతముల కలయికయే జీవి పుట్టుక. మనలోని రుూ పంచభూతాలు విడిపోవుటయే మరణము.
మనము చేసే జప, ధ్యాన, అర్చన, పూజాదికములన్నింటిలోను ‘ఓం’ కారము ప్రారంభంగా చెప్పబడింది. అందుకే ‘కాళికాపురాణము’లో ఓంకారము యొక్క విశిష్టతను తెలియజేస్తూ, ఓంకారముతో ప్రారంభమై ఓంకారముతో అంతముకాని ఏ మంత్రమైనా నిష్ప్రయోజనమని చెప్పబడినది. ఓంకారోపాసన మనిషిని, ఏ ప్రయోజనములు (కోరికలు) లేని స్థితికి చేర్చును. ఇట్టి ఓంకారాన్ని శ్వాసయందు, శ్వాసకు కారణమైన శక్తిగా ఉపాసన చేస్తారు.
ఓంకారము తరువాత ముఖ్యముగా చెప్పబడినది గాయత్రి మహామంత్రము. ఓంకారమే గాయత్రిగా దిగివచ్చినదని పెద్దలు చెబుతూ ఉంటారు. ‘సోహం’ అనునది గాయత్రి యొక్క సూక్ష్మరూపమైన ఉపాసన కాగా, స్థూలరూపం గాయత్రీ మంత్రం.
‘ఓం తత్సవితుర్వరేణ్యం / భర్గోదేవస్య ధీమహి / దియోయోనః ప్రచోదయాత్’-
అర్థం: నా బుద్ధినెవరు ప్రచోదనము చేయుచున్నారో అట్టి దేవతను, నేనుపాసించెదను. అట్టి దేవతాశక్తి నా బుద్ధినెల్లప్పుడు జాగృతము చేయుగాక అని అర్థం.
షట్చక్ర నిరూపణమను గ్రంథమునందు 50వ శ్లోకమునందు ‘హుం’ కారమును నుచ్చరించుట ద్వారా (్ధ్యనము చేయుట ద్వారా) కుండలిని శక్తి మేల్కొలుపుట వివరించబడింది.
యమ నియమములననుసరించి, ధ్యానమొనర్చు సాధకుడు, మంచి శీలము గలవాడై శ్రీనాథుడు అనగా పరమ పురుషుని ముఖమునుండి మహామోక్ష మార్గ క్రమమును తెలిసికొనును.- ఇంకాఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014