Others

డైరెక్టర్స్ ఛాయిస్.. అలా.. మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ఓ ఫ్యాషన్. అలాంటిది అనుకోకుండా అవకాశమొచ్చి -నటిస్తావా? అంటే కాదనేదేముంటుంది. హుస్సేన్ షా కూడా అలా వచ్చినవాడే. ఫ్రెండ్ పిలిచి సినిమాలో చేస్తావా? అంటే యస్ అన్నాడు. అలా ఆర్య-2లో కనిపించాడు. కట్‌చేస్తే -ఇప్పుడు డైరెక్టర్‌గా తన ప్రయత్నం సిన్సియర్‌గా చేశాడు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ‘మీకు మీరే- మాకు మేమే’ చిత్ర దర్శకుడు కిరణ్‌తో
ఈవారం చిట్‌చాట్

మీ గురించి...
-ఏముంది, మాది హైదరాబాద్. ఇండస్ట్రీలో చాలామందిలాగే బిటెక్ కంప్లీట్ చేశాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. స్క్రిప్ట్ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్. ఆ మక్కువే ఉద్యోగాన్ని వదులుకుని ఫ్రెండ్స్‌తో షార్ట్ఫిల్మ్ చేసేలా చేసింది.

సినీ రంగప్రవేశం...
-నిజానికి అనుకోనిదే. ఓరోజు ఫ్రెండ్ కాల్ చేసి -ఆర్య2లో చేస్తావా? అన్నాడు. లొకేషన్‌కి వెళ్ళా. ఓ చిన్న పాత్ర చేశా.

సుకుమార్‌తో పరిచయం?
-ఆర్య-2 చేస్తున్నప్పుడే. తరువాత తరచూ కలిసేవాడిని. రాసిన కథలు వినిపించేవాణ్ణి. ఒకరోజు ‘నాన్నకు ప్రేమతో’ కథ చెప్పా. ఆయనకు బాగానచ్చి ఇచ్చెయ్ అన్నారు. కాదనలేకపోయా.

ఆ కథతో అనుభూతి?
-నేను చెప్పిన పాయింట్‌కి హండ్రెడ్ పర్సెంట్ బెటర్‌మెంట్ ఇచ్చారు సుకుమార్. నా రియల్ లైఫ్‌లో తండ్రిని ఎంత ప్రేమిస్తానో అంత బాగా స్క్రీన్ ప్రజెంట్ చేశారు. అంతకంటే ఆనందం ఏముంటుంది?

ఇష్టమైన సినిమాలు?
-ఐతే.. హాలీవుడ్‌లో ఓషన్!!

మీకు ఇష్టమైన దర్శకులు?
-సుకుమార్, చంద్రశేఖర్ యేలేటి.

దర్శకుడిగా మీ తొలి సినిమా గురించి?
-మిస్సమ్మ సినిమాలో సావిత్రి పాడిన ‘మీకు మీరే మాకు మేమే’ పాట గుర్తుందిగా. అదే లిరిక్‌ని సినిమా టైటిల్ చేశా. మెచ్యూర్డ్ అమ్మాయి, ఇమ్మెచ్యూర్డ్ అబ్బాయి మధ్య ప్రేమ సంఘర్షణ. సినిమా చేయడానికి నా టీం సహకారం చాలా ఉంది.

ప్రస్తుతం ప్రాజెక్టులు?
-చూస్తున్నా. త్వరలోనే ప్రకటిస్తానేమో.