Others

‘ఈపీఎస్-95’ పెన్షనర్ల వెతలు తీరేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూతపడిన ప్రభుత్వరంగ సంస్థల్లో ‘ఈపీఎస్-95’ స్కీము కింద రిటైరైన ఉద్యోగులు తమ పెన్షన్ల పెంపుకోసం 2002 నుండి 2019 వరకూ ప్రభుత్వాలకు ఎన్ని విన్నపాలు చేసుకున్నా ఫలితం దక్కడం లేదు. కోర్టుల్లో కేసులు వేసి గెలిచినా, కమిటీల మీద కమిటీలు వేసినా, సంబంధిత మంత్రులను కలసి కన్నీళ్ళతో వేడుకున్నా ఏమాత్రం కరగని కఠిన హృదయులు ఈ రాజకీయ నాయకులని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
2013లో ప్రతిపక్షంలో ఉన్న భాజపా నాయకుడు ప్రకాష్ జవదేకర్ పెన్షనర్లకు కనీసం మూడువేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈయన 2014లోనూ, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన గతంలో చేసిన డిమాండ్‌ను గాలికొదిలేసారు.
ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్-95 (ఈపీఎస్-95) ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్కలా ఉన్నది. ఉదాహరణకు దేశంలో బాగా విస్తరించిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే తీసుకుందాం. ఇందులోని ఉద్యోగులకు 1992,1997లలో జరుపవలసిన వేతన సవరణలను నిలిపివేసారు. 2002/2003 సంవత్సరాలలో ఉద్యోగులందరికీ 1987లో ఉన్న వేతనాలమీద కొంతకలిపి బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించారు. వీరి పెన్షను గత దశాబ్దన్నర కాలంగా ఏమాత్రం పెంపుదలకు నోచుకోకుండా, ఇప్పటికీ వెయ్యి రూపాయలు లోపు వస్తున్నది. వీరు తమ అవసరార్థం అమ్ముకున్న భాగాన్ని తిరిగి పదిహేను సంవత్సరాలలో పెన్షనులో కలవాలి. అదీ చేయలేదు. వీరికి ఎక్కడా ఉచిత వైద్య సదుపాయం కల్పించలేదు. ఏ ఉద్యోగం, చదువు లేకపోయినా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, సమరయోధులకు, వ్యవసాయదారులకు పెన్షను సౌకర్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. వయసు మీరుతున్న యువతకు నిరుద్యోగ భృతి కూడా యిస్తున్నారు.
ఎఫ్.సి.ఐ.తోబాటు హెచ్.ఎమ్.టి, ఐ.డి.పి.ఎల్. తదితర మూతపడిన సంస్థల్లోని రిటైరైన ఉద్యోగులు అనేక ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను రాష్ట్రాలలోనూ, ఢిల్లీలోనూ నిర్వహించినా ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులకు చీమకుట్టినట్టయినా లేకపోవడం మిక్కిలి విచారకరం. మరో కేంద్ర సంస్థ అయిన నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్‌కు చెందిన అజంజాహి మిల్స్‌లో రిటైరైన వారి విషాద కథనాలు మరింత క్షోభకరంగా ఉన్నాయి.
ఇంకా కోర్టులు, కమిటీలు అని కాలయాపన చేయక కనీస పింఛన్లు అయిదువేల రూపాయలు చేసి, దీనిని కేంద్ర కరువుభత్యంతో అనుసంధానం చేయాలి. బలవంతపు పదవీ విరమణ పొందిన వారి వయసు డెబ్బయి ఏళ్లు దాటింది. కొందరు ఈ వయసును దాటిపోయారు. చాలామంది దివంగతులయ్యారు. కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పెన్షన్ పెంచుతారని చకోరపక్షుల్లా యింకా ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జీవిత చరమాంకంలో వీరిని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత కాదా?

-ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్