Others

మనస్సు అదుపులో వుంటే.. మానవుడే మహనీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలోని అన్ని జీవరాసులలో మానవజన్మ అత్యుత్తమమైనది. గత జన్మల పుణ్యఫలంవల్లనే జీవి మానవుడిగా జన్మిస్తాడు. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి తన మనస్సును అదుపులో ఉంచుకొని ఏకాగ్రతతో దైవాన్ని ప్రార్థిస్తూ తనలోని మనోనేత్రంతో ఆ దైవాన్ని చూడగలిగితే మానవుడు మహనీయుడు కాగలడు. ఇది అంత సులభం కాదు. ప్రస్తుత కాలగమనంలో మనిషి ప్రాపంచిక విషయాలతో ముడివేసుకొని సతమతమవుతూ ఉద్రేకాలకు, కోపానికి లోనవుతూ జీవితాన్ని వక్రమార్గంలోకి తీసుకుపోతున్నాడు. అందుకే ఆ మనస్సును అనవసర కార్యకలాపాలవైపు పోనీయకుండా అపవిత్రమైన పనులకు, ఆలోచనలకు లోనుకాకుండా మన అధీనంలో వుంచుకోవాలి. ఇందుకు ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే సరైనది. సత్ప్రవర్తనతో భగవంతుని నామ స్మరణతో సాటి మనిషికి సహాయం చేయగలిగే గుణం అలవర్చుకోవాలి. మానవసేవయే మాధవసేవ అనే సూక్తిని పవిత్రంగా ఆచరించగలిగితే ప్రతినిత్యం మనకు భగవంతుని దర్శనమవుతుందనే నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి. ఈ సేవ నిస్వార్థంగా వుండాలి. ఈ కార్యక్రమాలకు మనస్సును తన ఆధీనంలో వుంచుకోవడానికి మెడిటేషన్ చెయ్యడం చాలా ఉత్తమమైనది. దీనినే ధ్యానం అని కూడా అనవచ్చు. ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధీ మోక్షయోః’ - ఈ బంధాలకు మోక్షానికి మనస్సే కారణం. కనుక నా ఇష్టం అనే అహంకారాన్ని మనస్సులోనికి రానీయకుండా అహాన్ని దూరంగా ఉంచి ఆధ్యాత్మిక మార్గంలోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కోపము, ఉద్రేకము మనలో కలిగాయో ఆ మరుక్షణమే మనస్సును భగవన్నామస్మరణతో ఆధ్యాత్మికతవైపు మరల్చి కనులు మూసుకొని ధ్యానం చేస్తే మనలోని ఆవేశము, ఉద్రేకము చల్లారుతాయి. ఆ తరువాత నిర్మలమైన మనస్సుతో భగవన్నామ స్మరణ చేయగలిగితే మోక్షానికి మొదటి మెట్టు ఎక్కినట్లే. ఇది సాధించడానికి ఏకాగ్రత, కృషి చాలా అవసరం. అందుకే జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా ఆధ్యాత్మికతకు సమయాన్ని కేటాయించి ఆ సమయంలో మనస్సును మరొకవైపు పోనీయకుండా జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి సాధించుకోవాలి. కానీ మనస్సు చాలా చమత్కారం కలది. ఇది చిత్ర విచిత్రమైన చేష్టలతో ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంటుంది. అందుకే మనిషి తనలోని మనస్సు తత్వాన్ని గుర్తించాలి.
మనస్సు పారుతున్న నీరు వంటిది. నీటిని వడపోసి మంచినీరు సేవించినట్లుగా మనస్సులోని మాలిన్యాన్ని తొలగించి సత్యమార్గంలోకి ప్రసరింపజెయ్యాలి. సాటి మనిషిని నవ్వుతూ పలకరించాలి. అతనిలోని కష్టాలను, దుఃఖాలను తెలుసుకొని అతనిని ఆధ్యాత్మికత వైపు మరల్చి ధ్యాన మార్గంలోకి నడిపిస్తే అతని మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రయత్నంలో అలసట మర్చిపోయి జీవన ప్రయాణంలో తనకు ఎదురైన కష్టజీవికి సత్యమార్గాన్ని బోధించి దైవనామస్మరణతో తనలోని అశాంతిని, దుఃఖాన్ని పాలద్రోలవచ్చునని బోధించి అతనిలోని జ్ఞానాన్ని పెంచి సన్మార్గంవైపు నడిపిస్తే ఆ మనిషి మహనీయుడు అవడానికి అతని మనస్సే దారి చూపిస్తుంది. ఈ సత్యాన్ని నమ్మితే జీవితం ధన్యం.

-కురువాడ మురళీధర్