Others

తిమిరనాశకా త్రిపురాంతకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చేయలేనయ్య నిత్యాభిషేకములను
తిరుగలేనయ్య నీ దివ్య గిరుల చుట్టు
ఆత్మలోఁ జేతు నీ జపమదియుఁ గనుము
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శివయ్యా! నీకు నిత్యాభిషేకాలను చేయలేను, మహత్తరమైన అరుణాచలాది గిరి ప్రదక్షిణలను కూడా చేయలేను. ఆత్మలో నీ నామజపం మాత్రమే చేయగలను స్వామీ! నన్ను రక్షించుము.

తే.గీ. నమక చమకాలు వల్లింప నలవికాదు
లింగమూర్తివి నిన్ను నాలింగనంబుఁ
జేసికొని వేడుకొనెదనే శిరము వంచి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం : నమక చమకాలు వల్లించడం నా వల్లకాదు. లింగమూర్తివైన నిన్ను భక్తితో శిరము వంచి ఆలింగనం చేసుకొని రక్షించవలసిందిగా వేడుకుంటున్నాను నీలకంఠా!

తే.గీ. చంద్రవౌళీశ్వరా! శివా! సాంబమూర్తి!
అర్థనారీశ్వరా! ప్రభూ! హర్షమొంది
శతక రచనకుఁ బూనితి శ్రద్ధతోడ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ చంద్రవౌళీశ్వరా, శివా, సాంబమూర్తీ, అర్థనారీశ్వరా, శ్రద్ధ్భాక్తులతో ఆనందంగా నిన్ను స్తుతిస్తూ శతకరచనకు పూనుకొన్నాను స్వామీ.
తే.గీ. స్వామి! నీ యాజ్ఞ లేనిదే చీమయైనఁ
గుట్టబోదంచు లే శివా! కొలచునట్టి
వాడనే యాజ్ఞ నిడెదవో భస్మధారి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ పార్వతీశ పరమేశ్వరా! విభూతి ధారీ! నీ యాజ్ఞలేనిదే చీమకూడా కుట్టదుకదా. మా విషయంలో నీ యాజ్ఞ ఏమిటో తెలియకున్నది ప్రభూ!

తే.గీ. కాలకంఠేశ! కరుణతోఁ గవుమయ్య
కనులు మూసిన ఁ దెరచినఁ గనులముందుఁ
గదలుచుంటివో రుూశ్వరా! ముదము మదిన
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: శంకరా కనులు మూసినా తెరిచినా నీ సాక్షాత్కారవౌతున్నందుకు మనసులో ఎంతో ఆనందంగా ఉందయ్య. ఓ పరమేశ్వరా! మాపై కరుణ జూపి మమ్మల్ని కాపాడవయ్య స్వామీ!

తే.గీ. మల్లికార్జున స్వామి సేమమ్ము నిడగ
శ్రీ గిరీ భ్రమరాంబికాశీస్సులంది
పద్య సుమామాలనల్లితి భక్తితోడ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
బావం: శ్రీశైల మల్లికార్జున స్వామీ నాకు ఆయురారోగ్యాలు ప్రసాదించగా , ఆ భ్రమరాంబికా దేవి ఆశీస్సులతో భక్తి భావ పూరితుడనై శతక పద్య సుమమాలనల్లాను. ఓ పరమేశ్వరా! నన్ను కాపాడవయ్యా పార్వతీపతీ!
తే.గీ. కనులు నీకప్పగించంగఁ గాంచనేను
తిన్నడిని ఁ గాకపోతినే దేవదేవ
శక్తికొలదిగ నీ నామజపము దప్ప
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం ; ఓ పార్వతీ పతీ! నా కనులు నీకప్పగిద్దామంటే తిన్నడంతటి ముగ్ధ భక్తుడను నేను కాకపోతినయ్య! శక్తికొలది నీ నామ జపం మాత్రం చేయగల సాధారణమైన భక్తుడనైన నన్ను కాపాడు శంభుదేవా!

తే.గీ. బుద్ధిపుట్టెను నిను ఁ గూర్చి పొత్తమొకటి
వ్రాయ వలెనంచు గౌరీశ! బహువిధాల
పద్యముల నల్ల నలవోక ఁ బటిమ నిడుమ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ గౌరీశంకరా! నిన్ను స్తుతిస్తూ పుస్తకం వ్రాయాలనే బుద్ధిపుట్టిందయ్యా! అనేకవిధాలుగా పద్యాలను అలవోకగా వ్రాయగల శక్తియుక్తులను ప్రసాదించు స్వామీ!

తే.గీ. కట్టిపడవేసె నన్నుఁ జీకట్లు కట్లు
విప్పి నను విముక్తుడ ఁ జేతువీశ్వరుండ!
నీ మనంబు నెఱుంగదా! నామనంబు?
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ పరమేశ్వరా! అజ్ఞానమనే చీకట్లు నన్ను కట్టిపడవేసాయి. ఆ ఆ కట్లువిప్పి నాకు విముక్తి ని ప్రసాదించుస్వామీ! నీ మనసు వెన్న అని నా మనసుకు తెలియనిదా చెప్పు శివా!

- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262