Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోళ, పుళింద, పుండ్ర, పాండ్య, అభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ధ్రవిళ(డ), దశార్ణ, కర్ణాటక, గౌళ, అంగ, వంగ, వరాట, లాట, బాహ్లిక, మహుదాన, కిరాట, కేకయ, అశ్మంతక, కాశ్మీర, గాంధార, కాంభోజ,కేరళ, మాళవ, నేపాళ, ఘూర్జర, కుంతల, అవంతి, కామరూప, నిషధ మరియు కళింగ మొదలగు జనపదాలతో వర్థిల్లింది.
భారతదేశంలోని అనేక జనపదాలలో ‘నిషధ’ దేశం ఒకటి. ఈ దేశంలోని ప్రజలను నిషాదులు అని అంటారు. వీరు నిషాదులు అనే ఒక కొండజాతికి చెందినవారు. అనాదిగా ఒక ప్రాంతంలోగాని, దేశంలోనిగాని నివసించేవారు. అడవులోనే జీవించేవారు. వీరి ముఖ్య వృత్తి చేపలను పట్టడం, జంతువులను వేటాడం (ఈ విషయం మనుస్మృతిలో కూడా కలదు).
‘వేన’ అనేవాడు వీరి నాయకుడు. అతడు ద్వేషానికి, క్రోధానికి బానిసుడైనందువలన ఋషులు, బ్రాహ్మణులు వేనుడి ఎడమ భుజాన్ని (తొడను అని కూడా) మంత్రాలతోమధించగా అందుండి కాలిన కొరివివలె నల్లని, మిక్కిలి పొట్టి శరీరంతో, ఎఱ్ఱని కన్నులు కలిగిన, అశుచి అయిన ఒక్క మగవాడు పుడతాడు. ఆ అశుచి అయినవాడిని చూచి మునులు ‘నిషీధ! నిషీధ! (కూర్చుండుము! కూర్చుండుము) అని చెప్పి వదలి వెళతారు. తదుపరి అతడి సంతతే నిషాదులు అనే పేరున పివబడ్డారు.
ఈ నిషాధులు వింధ్యపర్వత, సాత్పురా పర్వత ప్రదేశాలలో క్రూర స్వభావులై నివసించటం ప్రారంభించార. ‘వేన’ అనేవానికి తదుపరి ‘వేనుడు’ అనే మహాపురుషుడు జన్మించాడు. ఆ వేనుడి వారసులు కొంతమంది నిషాదులుగాను, కొంతమంది మ్లేచ్ఛులుగాను పిలువబడ్డారు.
‘ఏకలవ్యుడు’ అనే నిషాధ తెగకు చెందినవాడు ద్వారకపై దండెత్తి వస్తాడు. అతడిని శ్రీకృష్ణవాసుదేవుడు వధిస్తాడు. ఇతడి రాజ్యం మరుభూమి (నేటి రాజస్థాన్ రాష్ట్రంలోని ఖిల్వారా జిల్లా)లోని ఆరావల్లి పర్వత శ్రేణుల ప్రాంతం. ఇదేగాక నిషాధుల రాజ్యాలు అనేకం ఉండేవి.
మరొక నిషధ రాజ్యం (నలునిది) మధ్యప్రదేశంలోనిది (నేటి గ్వాలియర్ జిల్లా చుట్టూ గల ప్రదేశం. ఈ నిషధ దేశం వాణిజ్య మార్గములలో గల దశార్ణ, కోసల, మరియు విదర్భ దేశాలను కలుపుచుండేది.
రామాయణం మహాకావ్యంలో కూడా ఈ నిషాధుల గురించి ప్రస్తావన కలదు. వీరి వృత్తి చేపలను పట్టడం, వేటాడటం. ఒక నిషాధుడు చెట్టుపై వున్న రెండు క్రౌంచపక్షుల జంటలోని ఒక దానిని బాణంతో కొట్టి చంపుతాడు. దాని ఎడబాటుకు రెండవ పక్షికి కలిగిన బాధను, వేదనను చూచి వాల్మీకి శ్రీమద్రామాయణాన్ని రచించాడు. వాల్మీకి కూడా ఒక నిషాధుడే.
రామాయణంలోని ‘గుహుడు’ అనేవాడు కూడా ఒక నిషాధుడే. రాజు శ్రీరామునికి స్నేహితుడు. సీతా లక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేస్తున్న శ్రీరాముని గుహుడు తన నావలో ఎక్కించుకొని గంగానదిని దాటిస్తాడు. నిషాధులను శబరులు అని కూడా అంటారు.
తూర్పునుండి పడమర సముద్రం వరకు ఆరు ముఖ్యమైన పర్వత శ్రేణులు కలవు. అందు హేమకూ పర్వతములు, నిషధ పర్వతములు ముఖ్యమైనవి. వింధ్య పర్వత శ్రేణులకు దక్షిణమున విదర్భ రాజ్యము కలదు.
సూర్యపుత్రి అయిన తపతి సంవర్ణుడు అనే వానిని వివాహం చేసుకుంటుంది. వారికి ‘కురుడు’ అనే ఒక కొడుకు పుడతాడు. కురుని పేరుమీదనే కురువంశం విలసిల్లింది. ఈ కురువంశ సంజాతులే కౌరవ పాండవులు.
అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు వద్దకు బృహదశ్వుడు అనే ఒక ముని వస్తాడు. పాండవులు ఆ ఋషికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజిస్తాడు. అప్పుడు ధర్మరాజు మహర్షితో ‘నావంటి అదృష్టహీనుణ్ణి ఇంతపూర్వం మీరెక్కడైనా చూశారా? కనీసం విన్నారా?’ అని అడుగుతాడు. అందుకు బృహదశ్వుడు నలుని చరిత్రను వివరించి చెబుతాడు.
నిషాదులలో ముఖ్యమైనవాడు ‘వీరసేనుడు’ అనే రాజు. ఇతడి కుమారుడే నలుడు, నలమహారాజుగా, చక్రవర్తిగా ప్రసిద్ధిచెందినవాడు.
నలుడు సర్వప్రియుడు. వేదజ్ఞాన సంపన్నుడు. బ్రాహ్మణ భక్తుడు. సత్యవాది. ఇంద్రియాలను జయించినవాడు. సర్వసద్గుణ సంపన్నుడు. మహాబలవంతుడు. యుద్ధనిపుణుడు. పరాక్రమశాలి. అశ్వశాస్తక్రోవిదుడు. అశ్వహృదయవిద్య తెలిసినవాడు. అంతకుమించి అందగాడు. పరమ సుందరుడు.
అంతేగాదు....
- ఇంకాఉంది