Others

సజావుగా సాగేనా? వాసనలతో పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మేలుకో! ఉదయించు, నీ లక్ష్యం నీవు చేరేవరకు విశ్రమించకు.’’ అని స్వామి శ్రీ వివేకానందులు చెప్పేవారు. ఎందుకు ఇలా చెప్పారని ఆలోచిస్తే మనలో చాలామంది జడత్వానికి అంటే అకర్మకు అలవాటు పడ్డారు. జీవితానికి ఏ లక్ష్యం లేకుండానే యాంత్రికంగా ధనార్జనే ధ్యేయంగా పాటుపడుతూ బుద్ధిని అచేతనావస్థలోనే ఉంచేశారు..
ఇంకొంతమంది ఎవరో ఒక మహనీయుని వాక్యాలు విని వారి ఉపన్యాసము విని వైరాగ్యము కలిగి,ఇక నుంచి స్థితప్రజ్ఞతతో ఉందామని నిశ్చయించుకుని తిరిగి ఇంటికి చేరగానే మరలా వాసనా వ్యామోహానికి గురవుతున్నారు. అందులో మునిగి కూడా పోతున్నారు.
ఎందుకు ఈ భూమిపైకి వచ్చాము? ఎక్కడనుంచి ఈ రాక? తిరిగి ఎక్కడికీ పోక. పుట్టేనాడు ఇక్కడ పుట్టాలని కానీ పోయేనాడు ఇపుడు పోవాలనీ కాని మనిషి అనుకోడు. ఈ వివేచన చేయడానికి చాలామంది అంత తీరిక ఉండదు. ఎపుడూ సంసార సుఖల కోసమే వెర్రి వ్యామోహంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము.
దీనికి కారణం మాత్రం వాసనలే. ఈ వాసనలే సంస్కారాలు. ఎప్పుడూ ఉన్నదానితో సంతృప్తిపడక, లేనిదానికై బాధపడుతూ మనం దుఃఖించడమే కా మన వారిని, పక్కనున్నవారిని కూడా దుఃఖింపచేసి తాను అశాంతి పాలై ఇతరులను అందులోకే లాగుతున్నాడు.
మన దేహం రెండు నిలువుభాగాలనుకొందాం. కుడి భాగం ఎప్పుడూ భవిష్యత్తును గురించి ఆందోళన, భయం పడుతూ ఉంటుంది. ఎడమభాగం ఎప్పుడూ గతించిన లేక గడిచిపోయిన దాని గురించి తీవ్రమైన మానసిక వేదనను కలుగచేస్తుంటుంది. వర్తమానంలో ఆరోగ్యంగా, భయరహితంగా ఉన్న సంతోషంగా ఉన్నా ఈ రెండు ఆలోచనలు ఉండనివ్వవు.
ఈ ఆలోచనలే వాసనలు అంటారు. ఈ వాసనా దుర్గంధం మనలను జన్మజన్మలైనా వీడకుండా వెంటాడుతూనే ఉంటుంది. కిందటి జన్మనుంచి ఈ జన్మకు వచ్చిన వాటిని దూరం చేసుకొందామనే తెలివి రాకముందే ముందున్న వాటికి ఈ జన్మలో మరికొన్ని కొత్తవి కూడుతాయి.
అలాంటి వాటిని ఒక్కసారి చూద్దాం.
దేహ వాసన: నేను శరీరమనే భావన. ఇది ఒక భ్రాంతి. నీవు దేహం కాదు ఇది సత్యం.
లోక వాసన: ఇది పదార్థములకు, వస్తువులకు, మనుష్యులకు సంబంధించినది ఎందుకంటే ప్రతిరోజు ఒక మనిషి ఎందరినో కలుస్తుంటాడు. మరెందరితోనో కలిసి పనిచేస్తుంటాడు. పూట గడవడానికి ఎన్నో మాయలు, మర్మాలు చేస్తుంటాడు. అదిగో అపుడే అసంతృప్తి మొదలవుతుంది. అశాంతికి బీజాలు వేస్తారిక్కడే.
శాస్తవ్రాసన: అనుభవ జ్ఞానము లేకున్నా, శాస్త్ర పాండిత్యము లేకున్నా, తర్కంతో, చాతుర్యంతో, కోపం, ఈర్ష్య, అసూయ వాటితో కూడుకుని ఎదుటివారు చెప్పింది వినకుండా అంతా తనకే తెలుసునని తాను చెప్పేదే సరియైనదని అశాంతికి లోను అవుతాడు. విజ్ఞాన మయకోశంలో ఊపిరాడదు. మనోవృత్తులు బహిర్ముఖం చేస్తాడు. ఎదుటివారు చెప్పింది వినరు. తాను చెప్పేదే వేదం అని వితండ వాదం చేస్తుంటారు. ఇది ఒక భయంకరమైన వాసన. దీనిలోంచే అహం పుడుతుంది. అహంకారం మనిఃని అధోగతి పాలవుతుంది.
ఈ వాసనాత్రయం ప్రతివారిలోను నశించితీరాలి. అపుడు దేహాత్మ భ్రాంతి నశిస్తుంది. మనసు బుద్ధిలో బుద్ధి ఆత్మ లో లయం అవుతుంది. ఇట్లాంటి స్థితి నందినవారు మహనీయులు, వీరి హృదయం పసిపిల్లల హృదయం లాగా శుద్ధ సత్వగుణములతో ఉంటుంది.

- కె. రఘునాథ్ 9912190466