Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ మాత్రమ్మిచ్చు కొరకునింకను యోచనలే?
మూడడుగులనే యడిగితి- ముల్లోకములడిగితే?

తలనడిగిన యిచ్చువాడ తలపించుక వలదు!
బలికైనను సమ్మతమే - బలియే నా పేరు!

మీ స్వాముల దయతోడనె నే స్వామిని గాదే?
తలలోతుల లోతలలో- తల మీరే కాదే?

నాకేటికి వగవు స్వామి? అర్పింపగ మీకు మీది?
నేనను భావమ్ము తక్క- నాదన్నది ఏమున్నది?’’

అని రాజసమొలుకు రీతి- నవ్వె రాజు ‘గలగల’
తొణకడు బెణకడు వటుండు- పూర్ణకుంభమటుల!

చేతగొనెను కమండలం- రేడు దానమిడగను
ఒక సంద్రంతోడ తొణకు- భూమిని చేగొనినటులను.

ఇంతలోనె అతని గురువు- శుక్రాచార్యుండును
‘‘ఆగుమాగుమోయి రాజ! ఆగుమాగు!’’ మనుచును.

రహస్యమ్ము నొకటూదెను- ఆతని చెవినేదో!
రాజు మోమోలోన తిరిగె- ఒక రంగుల రాట్నమేదొ!
‘‘వీడు కాడు వాడె వీడు! వీడు నిన్ను వీడడు!
అడుగులంచునడిగె కాని! అడుగుబట్టి పోదువు!’’
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087