Others

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుడు- మాధవుడు

తే.గీ. వల్లవాంగనల్ విరులను జల్లువేళ
కలువ పుప్పొడి మేనిపై యలముకొనగ
భస్మకలితాంగుడైనట్టి భవుని వోలె
ధవళ కాంతులన్ కృష్ణుండు తనరు చుండె
భావం: శ్రీకృష్ణుని పై గోపికలు పూలజల్లులు కురిపిస్తూ ఉన్నారు. కలువ పూవుల పుప్పొడి నీలమేఘశ్యాముని మేనిపై అలముకొనగా, విభూతిని ధరించిన పరమశివునివలె తెల్లగా మెరిసిపోతున్నాడు.

కేశవా
తే.గీ. ఆలమందల భక్షించు అసురుడైన
కేశిని వధించి గోవులన్ కృపనుగాచి
బ్రహ్మకాత్మజుడైన నారదుని చేత
నరయ కేశవా! యను నామ మందుకొనిన
నీల నీరద శుభ వర్ణ నీకు నతులు
భావం:కేశి అను రాక్షసుడు హయరూపాన్ని ధరించి గోవులను హింసిస్తూ భక్షిస్తూ ఉండేవాడు. నందాదుల మనవి నాలకించి కృష్ణుడు కేశిని సంహరించి గోకులాన్ని కాపాడాడు. అపుడు దేవర్షి యైన నారదుడు వచ్చి శ్రీకృష్ణుని చూసి ‘కేశవా’ అని పిలిచి సత్కరించాడట. ఆ విధంగా ప్రసిద్ధమైన కేశవనామాన్ని ధరించి వెలుగొందే నీలమేఘ శ్యాముడైన హరికి నమస్సులు.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949