Others

దాగుడు మూతలు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిబిఎన్ పతాకంపై నిర్మించిన -దాగుడు మూతలు చిత్రం 1964 ఆగస్టు 21న విడుదలైంది. ఈ చిత్రం ఆరోజుల్లో సంచలన, హాస్యరస, కరుణరస ప్రధానమైన కుటుంబ కథాచిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ నిర్మాణానికి సారథి డిఎల్ నారాయణ. కథను ముళ్లపూడి వెంకటరమణ సమకూరిస్తే, పాటలు అధిక శాతం ఆచార్య ఆత్రేయ రచించారు. మిగిలిన పాటలు అంతేవాసితో ఆరుద్ర, దాశరథి, కొసరాజు పూరించారు.
దీనికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ శాఖల్ని చేపట్టి వినోదం, విషాదం, వేదాంత ధోరణులతో తెరకెక్కించి మిశ్రమ సమ్మిళితంగా ప్రేక్షకులను నూటికి నూరుశాతం సంతృప్తిపర్చారు మహా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. నందమూరి తారకరామారావు కథానాయకుడిగా ఆదుర్తి సుబ్బారావుతో పనిచేసిన బహుకొద్ది చిత్రాల్లో పేరెన్నికగన్నదిగా ‘దాగుడుమూతలు’ చిత్రాన్ని చెప్పుకోవాలి. ఇదే కితాబు బి సరోజాదేవికీ వర్తిస్తుంది.
-కథావస్తువు యావత్తూ ఒక ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతుంది. ఆ ఫ్యాక్టరీ యజమాని విశ్వసుందర్రావు ఒక్కగానొక్క కొడుకు, తండ్రికి ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతో దూరవౌతాడు. చేరువౌతారు బంధువులు సూరమ్మ, భూషణం, వారి చిరంజీవులు పాపాయి- అమ్మడు. సూరమ్మ కొడుకు పాపాయి (పద్మనాభం), భూషణం కూతురు అమ్మడు. ఆ ఆస్తిని నమ్ముకుని వారంతా విశ్వసుందర్రావు ఇంటిని సాలెగూడులా అల్లుకుపోయుంటారు.
ఆ ఫ్యాక్టరీ వర్కర్స్‌కి అందుబాటులో హోటల్ నడుపుతుంటాడు కథానాయకుడు సుందయ్య. సవతి తల్లి రెండో పెళ్లివాడికి కట్టబెట్టబోతే ఇంటినుండి పారిపోయి సుందయ్య హోటల్‌కి, తదుపరి ఇంటికి, అతని చెల్లెళ్లకి సంరక్షకురాలౌతుంది కథానాయకి. ఇలాసాగే కథనంలో చివరికి సుందయ్య (కథానాయకుడు) విశ్వసుందరరావు తప్పిపోయిన మనవడిగా గుర్తిస్తుంది కథానాయకి సుబ్బులు.
రాబంధులాంటి సూరమ్మ, భూషణం విషవలయాన్ని చేధించుకుని చివరికి సుందయ్య విశ్వసుందర్రావుకి వారసుడై... సుబ్బులుకి భర్తయై.. పాపాయి, అమ్మడు ఒక ఇంటివారై కథకి శుభంకార్డు పడ్తుంది. ఆర్టిస్టులంతా అఖండ ప్రతిభకలవారే కాబట్టి వారివారి పాత్రల్ని బహుచక్కగా పండించి వంటకాన్ని షడ్రశోపేతం చేశారు. కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో నిండైన.. సంపూర్ణ... చిత్రరాజంగా అప్పటికి, ఇప్పటికి ఎప్పటికి కొన్ని దశాబ్దాలుగా సంతృప్తిని అందిస్తుందనడం ఎంతైనా తక్కువే అవుతుంది -నేటి చిత్రాలతో పోల్చుకుంటే. ఏ తరంవారికైనా ఈ సినిమా నచ్చే తీరుతుంది. అందుకే ఈ సినిమా నాకెంతో నచ్చినది, జనంమెచ్చినది కూడా.

ఆచార్య క్రిష్ణోదయ, 7416888505