Others

గాలికి కులమేది (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గాలికి కులమేది... నేలకు కులమేది... యింటికి మరుగేది... కాంతికి నెలవేది...’ అంటూ ఈ గీతం ‘మహారధి కర్ణ’ (తమిళ మాతృక) కోసం సినారె రాశారు. అంతేవాసితో సంగీత యశస్వి ఎమ్.ఎస్.విశ్వనాథం స్వర రచన చేస్తే, పి సుశీల కమ్మని గళంతో ప్రాణం పోశారు. తేట తేటతెనుగు పదాలతో పెదాలు కలిపిన నట అభినయిత్రి దేవిక అభినయం బహుధా ప్రశంసనీయం. నడిగర్ తిలకం పద్మశ్రీ శివాజీగణేశన్ హావభావ ప్రకటనం మధురం... మధురాతి మధురం.
ఈ పాటకి స్వర రచనంలో ఎంతకి సంతృప్తిచెందని నిర్మాతా దర్శకులు వినూత్నమైన బాణీలు కూర్చమని ఎమ్‌ఎస్వీవిపై ఎక్కువ వత్తిడే తెచ్చారు. చివరాకరికి వారనుకున్న విలువలను రాబట్టారు దర్శక స్రష్ట బిఆర్ పంతులు.
ఇక గీత వైశిష్ట్యాన్ని చెప్పాలంటే...
మహారధి కర్ణుడికి... అర్జునుడితో బలప్రదర్శన చేయాలంటే, తలపడాలంటే... కులం అడ్డుగోడగా నిలుస్తుంది. దాంతో మనస్తాపానికి గురైన కర్ణుణ్ణి ఓదారుస్తూ అతని అర్ధాంగి ఈ గీతాన్ని సోదాహరణంగా ఆలపిస్తుంది. అతని మనసుని ఊరట పరుస్తుంది.
పాలకు ఒకటే తెలివర్ణం... ఏది... ప్రతిభకు కలదా స్థల భేదం. నిజమైన వీరులకెందుకు కులభేదం, అది మనుషుల మధ్య పూడ్చలేని అగాధం. జగమున కీర్తి మిగులుతుంది... అది యుగాలకైన స్థిరంగా నిలిచిపోతుంది. దైవము నీలో నిలుచునులే... ధర్మము నీతో నడుచునులే అంటూ సాహసానికి, వీర లక్షణాలకి దైవము, ధర్మము ఎప్పటికి వెన్నంటి ఉంటుంది- స్థిర కీర్తి చిరంతరం నిలిచిపోతుంది అంటూ. ఇది ఒకరకంగా ప్రభోద గీతం. కులవ్యవస్థలో, మతవ్ఢ్యౌంలో కూరుకుపోయే మానవాళికి చైతన్యగీతం.
ఈ గానామృతం స్వరాలకి వ్రాసిన పదప్రవాహం లలితమై, మధురమై, స్వరమాధుర్యమై పి సుశీలమ్మ గళంలో, దేవిక అభినయంలో ప్రకాశవంతమైంది. ఈ గీతం నిర్మాణంలో పాత్ర వహించిన వారందరు శ్లాఘనీయులే సుమా!!

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505