Others

ఓటమి ఎంత దుర్భరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విపక్షాలన్నీ ఏకమై మోదీని మనసారా తిట్టిపోసి భాజపా ఓడిపోతున్నదని నమ్మాయి. ప్రజల్ని నమ్మించ ప్రయత్నించాయి. అయితే తాను ఒకటి తలచిన దేవుడు మరొకటి చేయును అన్న సామెత నిజం అయింది. భాజపా తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఏపీలో జగన్ చరిత్ర సృష్టించాడు. ఓడినప్పుడు నేతలు నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకొని ఓటమికి కారణాలు అనే్వషించి ఆ తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రజాస్వామ్యం అంటే అదే. కానీ ఓడిన పార్టీల నేతల ప్రకటనలు చూడండి...
తాము ఏ తప్పూ చేయలేదన్నాడు చంద్రబాబు. ప్రజలే తమకు ఓటు వేయకుండా తప్పు చేశారని ఆయన ఉద్దేశం కాబోలు! ఎన్నికల ముందు ఈవీఎంల మీద, ఈసీ మీద విమర్శలు గుప్పించిన ఆయన ఫలితాలు వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ఆరునెలలు సావాసంచేస్తే వారు వీరు అవుతారు అన్న సామెతను నిజం చేస్తూ పవన్‌కళ్యాణ్-చంద్రబాబు భాష, భావాలు పుణికిపుచ్చుకొని తనని ఓడించడానికి పెద్ద కుట్ర జరిగిందనీ అందుకు 150 కోట్లు ఖర్చుపెట్టారని చెప్పాడు. శరద్ పవార్ ప్రజలు ఈవీఎంలను నమ్మటం లేదు అన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయనే స్వయంగా ఈవీఎంలను సమర్థించిన విషయం సమయానుకూలంగా మరిచిపోయాడు!
రాజకీయాల్లోకి వచ్చేముందు మోదీని తిట్టిపోసిన ప్రకాశ్‌రాజ్ బెంగళూరులో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఓడిపోయాక- ఓటర్లు తనని గట్టిగా చెంప దెబ్బకొట్టారని చెప్పుకుంటూ అయినా ఫర్వాలేదు, అదరక బెదరక స్థిరంగా నిలబడతానని చెప్పాడు. నాకు కులం, మతం లేదు. ఏ రంగూ లేదు అంటూనే కాషాయం ఇష్టంలేదని చెప్తూ ఎర్ర రంగు పూసుకున్నాడు కమల్‌హాసన్. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో తన అభ్యర్థి తరఫున మాట్లాడుతూ గాంధీని చంపిన గాడ్సే మొదటి హిందూ టెర్రరిస్ట్ అని ప్రగల్భించాడు. తన పార్టీ క్షుణ్ణంగా ఓడిపోవటంతో పట్టణ వాసులందరూ తమకే ఓటేశారన్నాడు! తనంత గొప్పవాడికి ఓట్లువేయని గ్రామీణులు వెర్రి వెధవాయిలని ఆయన ఉద్దేశం కాబోలు! చంద్రబాబుకి అసలుసిసలు నకలుగా కనిపించే మమతాదీదీ కూడా భాజపా కుట్ర, విభజన రాజకీయాలు అని మండిపడింది.
వీళ్లందరిలోనూ ఒక కామన్ క్వాలిటీ ఏమంటే- తామంతా గొప్పోళ్లు అనీ, తాము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అన్న భ్రమలో ఉండటం!
అయితే వాళ్లకు తెలియదు అమాయకంగా కనిపిస్తూనే కీలెరిగి వాతపెట్టే నైపుణ్యం ప్రజలకు పుష్కలంగా ఉంది అని! ఓటమి ఎంత దుర్భరం!

- డిల్యా, కాకినాడ