Others

దివ్యఫలం ‘బ్యాటరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పుడతాడు
ఒక దివ్య ఫలంతో..
ఒక పదునైన చాకుతో..
ఆకలైనప్పుడల్లా
చాకుతో పండును కోసుకొనటానికి
ఆనందంగా బతకటానికి...

ఆ పండు మామూలు పండు కాదు,
ఎంత కోసుకుతిన్నా తరగదు అక్షయ పాత్రలా..
కానీ ఒక నిబంధన - క్రమం తప్పకుండా
స్వయం కృషితో ‘చార్జి’ చేసుకుంటూ ఉంటేనే
దివ్యఫలం నిలిచేది, భవ్యరసం అందించేది

కాకపోతే...
మనిషి ఏం చేస్తున్నాడంటే
అతి తెలివిగా, అతి ముదురుగా
ఇతరుల ఫలాలు కోసుకుంటున్నాడు
అందులో లేని రుచులు భావించుకొని
స్వీయకాంతుల్ని జార్చుకుంటున్నాడు..

మనిషెంత పిచ్చోడో!
ఇతరుల పండ్లు కోసుకుతినే పనిలోనే మునిగిపోయి
తన పండు ‘బ్యాటరీ’ని చెడగొట్టుకుంటున్నాడు
మొత్తానికి తన విలువే
పడగొట్టుకుంటున్నాడు

- డా. రావి రంగారావు, 9247581825