Others

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురుచిర విశాల ప్రాకార సుందరమగు
ద్వారకాపురీ నిర్మాణ తరుణమందు
శౌరి వినతిని మన్నించి సాగరుండు
వెనదిరిగినట్టి వైనమ్ము వింతగొలుపు
భావం: పరిస్థితుల ప్రాబల్యం వల్ల శ్రీకృష్ణుడు ఓసారి సాగరమధ్యంలో తను, తన పరివారం నివసించాలనుకొన్నాడు. అపుడు విశ్వకర్మను పిలిచి తన ఆలోచనను చెప్పాడు.దానికోసం శ్రీకృష్ణుడు సముద్రుడిని పిలిచి ద్వారకపురానికి స్థలమివ్వమని అడిగాడు.సాగరుడు చిత్తం అంటూ ద్వారకాపురానికి అనువైన స్థలమిచ్చాడు. ద్వారకాపట్టణం నిర్మితమైంది.
వర్షఋతువుననొప్పారు వాహినివలె
శరదృతువులోన రాజిల్లు సర్మమువలె
ఆమనిని వెల్గు సుందరోద్యానము వలె
ద్వారకాపురి సిరితోడ వరలుచుండె
భావం: వర్షఋతువులో నిండుగా ప్రవహించే నదిలాగా శరదృతువులో తారకలతో నిర్మలంగా ప్రకాశించే ఆకాశంలాగా, వసంత ఋతువులో ఆమనిశోభలతో వెలుగొందే ఉద్యానవనం లాగా శ్రీకృష్ణుని రక్షణలో ద్వారకానరగరం సిరిసంపదలతో తులతూగుటలోని సిరిమనోవల్లభుడే నాథుడైన నగరానికి ఏ కొరత ఉంటుంది?

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949