Others

పశుపతితత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. ఇలా ఏమిటా అంటారా.. వినండి.. ఇందులోనే మంచి విజ్ఞానముంది. కూపస్థమండూకాల్లా మానవ జన్మ లభించినా ఉన్న విజ్ఞానంతోనో లేక చుట్టు పక్కల జరిగేవే ప్రాముఖ్యమైనవి అని వాటిని మాత్రమే చూస్తూ ఉంటే జ్ఞానం వృద్ధి అవదు. విజ్ఞానం పెరగదు. మానవుడు తనకున్న విచక్షణా వివేచనలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను అవగాహన చేసుకొనాలి. ధర్మమేమిటో వివేచించుకోవాలి. అధర్మమేమిటో తెలుసుకోవాలి. అపుడే నలువైపుల నుండి విజ్ఞాన వీచికలు ప్రసరిస్తాయి. సద్గురును అనే్వషించాలి. ఆయన చెప్పిన బాటలో నడవడానికి ప్రయత్నించాలి. ధర్మసూక్ష్మాలను సంగ్రహించాలి. మంచి దారి ఎన్నుకొనాలి. ఆ ఎన్నుకొన్న దారిలో నడవాలి. లేకుంటే కేవలం ధర్మమీమాంస చేయగలిగి, సత్యధారణ చేయగలిగినా ప్రయోజనమేమీ ఉండదు. ఎప్పుడైతే తెలుసుకొన్నదాన్ని ఆచరిస్తామో అపుడే విజ్ఞానం దినదినాభివృద్ధి అవుతుంది. దానితో మనిషి ఇలలోనే స్వర్గాన్ని సృష్టించగలుగుతాడు. స్వర్గమంటే కేవలం అప్సరస కన్యలు భోగభాగ్యాలు , హంసతూలికా తల్పాలు మాత్రమే కాదు. మనం జీవించే ఉన్న చోట నలుగురి కల్యాణం కోసం శ్రమించి ఎదుటివారిలో చిరునవ్వును చూడగలిగితే అదే స్వర్గం. ఇట్లాకాకపోతే మనిషి జన్మ అయనా ఒకటే పశుజన్మ అయనా ఒకటే నన్నమాట. మనిషి కూడా పశువే. కాకపోతే పశుత్వాన్ని వీడి పశుపతితత్వ్తాన్ని అలవర్చుకుంటే మనిషి దివ్యుడు అవుతాడు. *