Others

కవిత ఓ పరమాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత ఓ పరమాన్నం
ఎప్పుడూ తింటే రుచించదు
ఓ పండుగ ఓ పబ్బంలా
సమయం సందర్భం
ఎంతో అవసరం మరి
అవి వచ్చినప్పుడు మాత్రం
పిలవకనే వచ్చిన ఆప్తులవలె
పలకరించిపోతుంది
తన సాహచర్యం లేని
జీవితాన్ని ఊహించాలంటేనే
గుండె బరువెక్కిపోతుంది
అందుకే తన కోసం ఎదురుచూపు

వస్తూ వస్తూ తన వెంట
కమ్మనైన మాటల్ని
చిక్కనైన భావాల్ని
అరుదైన మనోచిత్రాల్ని
కోసుకొచ్చి తీసుకొచ్చి
తీయటి పాయసంలా
మనసుని హృదయాన్ని నింపి
తన అస్తిత్వాన్ని చాటి
మరొక్కసారి ఇంకొక్కసారి
తన కోసం ఎదురుచూసేలా
మనల్ని పసిపాపల్ని చేసి
అమ్మలా లాలించిపోతుంది

రోజూ తింటే తీపి చేదవుతుంది
అన్నంలా కాకుండా పాయసాన్ని
పరమాన్నంలా తిందాం
పండుగలా అనిపిస్తుందప్పుడు

- జంధ్యాల రఘుబాబు, 9849753298