AADIVAVRAM - Others

పులకింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడవ సేతబట్టి
సెరువు కాడికొస్తివి
ఈత కొడుతున్న నన్ను
లేత కళ్లతో జూస్తివి..
సెరువు కాస్త సంద్రమైనాది
మనసు కాస్త కెరటమైనాది
కడవ నిండా నీళ్లలెక్క
గుండె నిండా నీ రూపు నింపుకుంటే
వంక మీద కొంగ లెక్క
వాగు మీద తెప్ప లెక్క
ఎళ్తున్న నినే్న జూస్తూ..
సెరువుకానే్న
సెక్కబొమ్మలెక్క నిలుసుంటి

సెరువు గట్టున కూసుని
సేపల్ని పడుతుంటే..
సేనుగట్టు మీంచి
సొగసు సూపిస్తివి
నాలో సెగలు బుట్టిస్తివి..
కొమ్మల మాటు నుండి
నాటుగా నాకెళ్లి జూసి
కాటుక కళ్లతో కవ్విస్తివి
కాసింతలో కనుమరుగైతివి

గడ్డిమోపు నెత్తినెట్టుకుని
గట్టుమీద హంసలెక్క నడిసొస్తివి
ఇంపైన నీ నడుమొంపు జూస్తి
నీ సింగారం సోకిన కళ్లతో
రేయంతా జాగరణ జేస్తి

పొద్దునే్న లేసి పొలానికెళ్తాంటే..
ఎర్ర సూరీడి ఎలుగులో
తెల్ల కలువలు కనబడి
నీ కళ్లు గుర్తుకొచ్చె!
ఎంటనే..
కొలనులో దూకితి
కలువపూలు లేపుకొస్తి
నీ కళ్లకు కానుకిస్తి
కల్లతోనే నవ్వులొలికిస్తివి
నీ నవ్వులేరుకుని
గుండెలో దాసుకుంటి

మనసులో మాట జెప్పి
మనువాడేద్దామనుకుంటి..
నువ్వొచ్చే దారిలో
చలువ పందిళ్లు పరిస్తి..
నీ కిద్దమని
పువ్వట్టుకు నిలుసుంటి
రంగులవోణి గట్టుకుని
ఇంద్రధనస్సులా నడిసొస్తివి
నా మనసల్లె పువ్వు నీకిస్తి..!
సొట్ట బుగ్గలెట్టి
పువ్వ దీసుకుంటివి
మువ్వల కాళ్లతో
ముందుకెళ్తివి..
ఈసారి
నీ కెళ్లే జూసుకుంటూ
సెక్కబొమ్మలా నిలబడలే..!
నీవెంటే నీడనై నడిసొస్తి
ఎనక్కి తిరిగి ఎనె్నల కురిపిస్తివి
నా చేయందుకుని
తోడు రమ్మంటివి..
మనసు నింగి కెగిరే
వయసు దిక్కులకు పరుగెత్తే
గుండెలో పులకింత
కళ్ల నుండి ఒలికి పడె...

- ఎ. నాగాంజనేయులు.. 9959017179