Others

దివినుండి భువికి.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన పాట, జనం మెచ్చిన పాట.. దాశరథి పాటల పూదోట విరిసిన పాట -దివినుండి భువికి దిగివచ్చె/ దిగివచ్చె పారిజాతమే నీవై నీవై’’... ఈ పాట ‘తేనెమనసులు’ చిత్రంకోసం కవితాశరధి దాశరధి వ్రాయగా.. కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు. గాన గంధర్వుడు ఘంటసాల, పి సుశీలమ్మ ఆలపించగా.. అప్పుడే తెరమీదకి తెచ్చిన రామ్మోహన్... తెరమీదకొచ్చిన సంధ్యారాణిలపై ఆదుర్తి సుబ్బారావు చిత్రీకరించారు. అశేష ఆంధ్ర, ఆంధ్రేతరులకు కనువిందు చేసింది ఈ గీతం, దృశ్యం. కొత్త నటీనటులతో చిత్ర నిర్మాణానికి దిగిన ఆదుర్తి సుబ్బారావు గట్స్ గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. హీరో సూపర్ స్టార్ కృష్ణగా, ప్రముఖ నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఎదగడం మరో విశేషం. కృష్ణ ఘనతలన్నీ సాహసి ఆదుర్తి ఖాతాలోకే వెళ్తాయి అని చెప్పడం ఎంతైనా సమంజసం.
ఇక పాటలోని పాదాలను అవలోకనం చేస్తే పదం పదంలో లాలిత్యము, మోహావేశము, కవిచాతుర్యము తొంగి చూస్తాయి. దివినుండి భువికి దిగివచ్చె దిగివచ్చె పారిజాతమే నీవై నీవై గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై... అందని జాబిలి అందాలు పొందాలి అనుకున్నానొకనాడు ఆనాడు
అందిన జాబిలి పొందునో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు
కనరాని దేవుని కనులా చూడాలని కలగంటి నొకనాడు ఈనాడు
కల నిజము చేసి కౌగిలిలో చేర్చి కరిగించే ఈనాడు ఈనాడు
కడలిలో పుట్టావు అలలపై తేలావు నురగవై వచ్చావు... ఎందుకో...
కడలి అంచువు నిన్ను కలిసి నీ ఒడిలో
ఒరిగి తరగాలని ఆశతో... చరణంలోని ప్రతి అక్షరం ప్రాణం పోసుకు ఉరికింది అనడానికి... కవితావేశం కనడానికి రెండు నేత్రాలు చాలుగా అన్నట్లుగా పాటలోని పదాలకి తగినట్లుగా బృందావన్ గార్డెన్స్ అందాలు ఒకపక్క, కథానాయకా నాయికల చందాలు ఇంకొకవైపు కుర్రతనాన్ని కుదిపేశాయి, వారి మనోభావాల్ని కడలి అలలవరకు సాగదీస్తాయి ఈ పాట చిత్రీకరణలో. అందుకే ఈ పాటంటే నాకెంతో మక్కువ-

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505