వినమరుగైన

సూర్యశతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిన్నలే పెద్దలైపోయె వినరు మాట
వెరతురే పెద్దలీనాడు పిన్నలకును
హద్దుమీరిన ముద్దుసేయంగ ఫలము
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: నేటి కాలంలో పిల్లలే పెద్దవాళ్లయి పోయారు. చెప్పిన మాట వినరు. పెద్దలే పిల్లలకు భయపడుతున్నారెంతగానో! హద్దుమీరిన ముద్దు చేస్తే ఫలితమిదే. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య.

వింతరోగాలు మందులు వెల్లువెతె్తై
క్రిక్కిరిసి వైద్యశాలలు రేబవళ్లు
రోగగ్రస్థులతో నేడు మాగతేమి?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: వింత వింత రోగాలు, అనేక రకాల మందులు ఎంతగానో వెల్లువలై వ్యాపిస్తున్నాయి. వైద్యశాలలన్నీ రాత్రింబవళ్లు రోగగ్రస్తులతో క్రిక్కిరిసిపోతున్నాయి. మాగతేం కాను. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262