Others

శ్రీ గురుగీతా వైశిష్ట్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ గురుతత్త్వమే పరమాత్మ తత్త్వము - అమృతము- శుభంకరము కైవల్యమని అందరూ నిరంతరమూ జ్ఞప్తియందుంచుకొనవలయును. లోకం లో సర్వులూ శ్రీ గురుపాదారవింద సంస్మరణము- సేవలతో తరించినవారే. సకల తత్త్వమార్గదర్శి శ్రీ గురుదేవుడే.
తత్త్వమును బోధించుటకు పలు వేదాంత శాస్తమ్రులున్నాయి. ఈ తత్త్వమునే పురాణాలు మనం సులభంగా అవగాహన చేసుకొనటుకు కథా రూపముగా తెలుపుచున్నాయి. భగవద్గీత- శివగీత- రామగీత మున్నగునవి పురాణాంతర్గతములై విరాజిల్లుచున్నవి. వీటినే స్మృతులనీ, వీటిని మహర్షులు సులభశైలిలో, విశాల భావాలతో నేర్పరచినారు. గీతలు మహర్షి నిర్మితాలు. ఉపనిషత్తుల సారాలు. స్కాంద పురాణాంతర్గతమైన సనత్కుమార సంహితయని తెలుపబడు ఉమామహేశ్వర సంవాద రూపమైనదే శ్రీ గురుగీత. ఇది సర్వ వేదాంతసారమై శ్రీ గురుభక్తి, జ్ఞానాది వైభవాలతో నిండియున్నది. సకల విజ్ఞానమునకు ఆధారము శ్రీ గురుదేవుడే గాన శ్రీ గురుదేవుని దగ్గర దీక్షను గైకొని నియమ నిష్టలతోనున్నచో విజ్ఞానులై ముక్తిని పొందగలరని పరమేశ్వరుని ఆకాంక్ష, ఆశయం.గురుగీతలో గురుస్వరూప స్వభావాదులు- శిష్యుల ప్రవర్తనము, శిష్యుడు గురువు వద్ద ఉండవలసిన పద్ధతులు- శిష్య ధర్మములు నిండి యున్నాయి. గురుగీత విశేషజ్ఞాన భాండాగారము. గురుదేవుని అనుగ్రహం పొందవలెనన్న గురువు వద్ద జ్ఞానదీక్షను పొందాలి. ఈ జ్ఞానదీక్ష సకల కర్మలను నశింపజేసి నిర్మల జ్ఞానమొసంగగలదు. గురు గీతాశాస్తమ్రు యొక్క ముఖ్యసారమిదియే.
‘‘దీయతే విమలం జ్ఞానం
క్షీయతే కర్మవాసనా, తేనదీక్షేతి ప్రోక్తా’’ అని.
ఇది మహాపవిత్రమై సకలశాస్త్రానుసారమై ముక్తిదాయకమై యున్నది. సద్గురు కృపాకటాక్షము చేతనే సకలమూ సిద్ధించగలదు. త్రిమూర్తులు కూడా శ్రీ సద్గురుదేవుని కటాక్షమునకై ఎదురుచూసినవారే! సద్గురు శరణాగతియే మోక్షమునకు మూలమని తేల్చినది. గురువంటే ఇష్టంలేనివారికి ముక్తి దుర్లభము. ఆధ్యాత్మిక మార్గమున గురువు యొక్క ఆశ్రయము తప్పనిసరి. గురువు అనుగ్రహం లేనిదే చిత్త విశ్రాంతి- ఆత్మశాంతి లభించవు.
స్కాందపురాణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి గురు శబ్ద వైశిష్ట్యమును, గురుతత్వ ప్రభావం, గురుభక్తి విధానమును విశదీకరించినారు. గురుయొక్క గొప్పదనమును చక్కగా వర్ణించినాడు శివుడు గురుగీతగా!
గురువు విశిష్టత
గురువనగా భక్తుల హృదయ తాపములను పోగొట్టి అజ్ఞానతమమును నశింపజేయువాడు. ఆ గురుదేవుడే మంగళస్వరూపుడైన శివుడు గురువే ఈశ్వరుడు. ఈశ్వరుడే శ్రీగురుదేవుడు. శ్రీగురుదేవుడనుబ్రహ్మమే పరబ్రహ్మము. వేరే పదార్థమేదియూ లేదు ఈ విశ్వంలో.‘గురు’యను రెండక్షరములను అష్టోత్తర స్తోత్రాదులను స్మరించడమే జపముగా భావించబడుచున్నది. గురుమూర్తినే ధ్యానించాలి. ఆయన మంత్రమునే పరమ మంత్రముగా జపించి, స్మరించి తరించాలి. ‘గురు’కారము తమస్సు. అనగా చీకటి, అజ్ఞానము. ‘రు’కారము దానిని నశింపచేయు ప్రకాశము. అనగా అజ్ఞానమనే తమస్సును పోగొట్టే జ్ఞాన ప్రకాశము అని గురు శబ్దార్థము. ‘గు’ అనగా భవరోగము. ‘రు’ అనగా తన్నాశకము. భగవరోగమును నశింపజేయువాడే గురువు. ‘గు’కారమునకు త్రిగుణములైన సత్త్వ రజ తమో గుణములనతిక్రమించినవాడనియు, ‘రు’కారమునకు రూపరహితుడని అర్థముగా గురుశబ్దము గుణాతీతత్వమును, రూపాతీతత్త్వమును బోధించుటవలన గురువు త్రిగుణాతీతునిగా వర్ణింపబడినాడు. అఖండ జ్ఞానముగల మహాత్ముడు గురువు. గురుభక్తులు శిష్యులైనవారు గురువును నిరంతరము ఉపాసించవలయుననీ, సర్వమూ గురువునకు అర్పించవలయుననీ గీత తెల్పుచున్నది.
సద్గురు సన్నిధానంలో శిష్యుడు అభిమాన సంకోచాలు లేనివాడై ఉంటూ, దీర్ఘముగా సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి గురువాజ్ఞకై సమీపాన నిలిచి ఎదురుచూస్తూ ఉండాలి. గురువును సకలాత్మ స్వరూపునిగా భావించి, గురువుకన్నా శ్రేష్టమగు ఇతర పదార్థమేదియు లేదని పూజించాలి. గురుదేవుని శరణాగతి తత్త్వముతో ఆరాధించాలి. వేదాంత శాస్తమ్రులో గురు శుశ్రూష నాలుగు విధములుగా నున్నది. 1.స్థానశుశ్రూష 2.అంగశుశ్రూష 3.్భవశుశూష్ర 4.ఆత్మశుశ్రూష.
గురువే జ్ఞానస్వరూపుడు. సర్వలోక పూజ్యుడని గురుగీత బోధించిన గురుమహిమ - తత్త్వం. సద్గురుమార్గంలో పయనించుట జీవులకు పరమ లక్ష్యం. అదే గురుసేవాఫలం.

-పి.వి.సీతారామమూర్తి 9490386015