Others

ప్రయోజకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ నీ విజయగాథలేనా
ఎన్నిసార్లు వినిపిస్తావు!
నిజమే
సున్నా దగ్గర్నుంచే మొదలయ్యావు
పక్కన అంకెలెలా వచ్చాయో
విడమర్చి చెప్తావు

నీ శ్రమా దీక్షా
మొక్కవోని నీ పరాక్రమం
నువ్వు సాధించిన విజయాల గురించీ
తేజోవిరాజితమైన ప్రస్తుత స్థాయ గురించీ
చెప్తూనే వున్నావు
నేను వింటూనే వస్తున్నాను

కాని ప్రవచనాల ఆపి
ఒక్కసారి యోచించు
నువ్వూ నేనూ ఒకేసారి
ఈ ఊరిమట్టిలోనే పుట్టాము
రెండు పక్షులకూ
ఒకే రకమైన రెక్కల బలముండేది
బహుశా నాకే కొంత ఎక్కువ

నువ్వు ఎగిరిపోయావు
నేను మాత్రం
అదే గూటి గడ్డిపోచలను
మళ్లీ మళ్లీ అల్లుకుంటూ బతుకుతున్నాను

కారణాలు నేనూ వల్లించగలను
నువ్వు వదిలేసిపోయన మూల్యాలు
నాకిప్పటికీ అమూల్యమే
కాని నీ ఘన చరిత్రకు
నేనిప్పుడు శ్రోతగా మారాను

- డా. ఎన్.గోపి