Others

కలిమి, బలిమినిచ్చే సూర్యారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు సూర్యారాధన చేస్తే అంతులేని ధనరాశులు అనారోగ్యమే లేని ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుని ఆరాధిస్తే కలిమే కాదు బలిమి కూడా ఉంటుందనేది ఆర్యోక్తి. ప్రాతఃకాలంలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం మహేశ్వరుడుగాను సాయంకాలంలో విష్ణుమూర్తిగాను ఆదిత్యుడు పూజించాలి.సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యోదయ సమయంలో చేతులు జోడించి నమస్కరించటం, అర్ఘ్యం సమర్పించటం ఎంతో ముఖ్యమైనవి. సూర్యారాధనలో ప్రధానమైనవి సూర్యనమస్కారాలు. మంత్రపూర్వకంగా చేసే సూర్యనమస్కారాలవలన శరీరానికి యోగాసనాలు చేసిన ఫలితం కలగటంతోపాటుగా మానసికంగాను ప్రశాంతత లభిస్తుంది.ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యారాధన వలన శారీరక రుగ్మతలు, బాధలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నిత్యం సహజంగా లభించే సూర్యరశ్మి శరీరానికి సోకటంవలన చర్మ సంబంధమైన వ్యాధులు నశించటమే గాక ఎముకల పటిష్టతకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సూర్యారాధన కూడా అనాదిగా వస్తున్నదే. ప్రపంచం మొత్తం సూర్యుని ఆరాధిస్తుంది. స్వల్ప సాధన, ఆరాధనలకే మోక్షమిచ్చు భగవానుడు భానుడే!
రామ రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి వచ్చి శ్రీరామునికి సూర్య సంబంధమైన ‘ఆదిత్య పురాణం’ అనే దివ్య స్తోత్రాన్ని రామునికి ఉపదేశించినట్లు దానివలన రాముడు విజయం సాధించాడని రామాయణం చెబుతుంది. రామాయణంలో ముఖ్య ప్రాతగా కనిపించే ఆంజనేయునికి గురువు సూర్యుడు. సూర్యుని ఎదురుగా నిల్చుని ఆంజనేయుడు సూర్యుని దగ్గర సకల విద్యలూ నేర్చుకున్నాడని అంటారు. సూర్యారాధన సకల విద్యలనూ కూడా ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు శ్రీకృష్ణుని ఉపదేశానుసారం సూర్యారాధన చేసి తనకు వచ్చిన రోగం నుండి విముక్తుడైనట్లు పురాణాలు చెబుతాయ.
ప్రతిరోజు ఆదిత్యహృదయం సూర్యుని ఎదురుగా నిల్చుని చదివినా కూడా సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. ఆదివారం నాడు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి సూర్యుని అనుగ్రహాన్ని పొందవచ్చు.

- జి. వివేక్