Others

వానాకాలంలో ఆహార జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా సీజన్‌కు తగినట్టుగా జీవనశైలిని, ఆహారశైలి మారుస్తూ ఉండాలి. మండు వేసవి తరువాత వచ్చే వానాకాలం అంటే ఎవరికైనా ఇష్టమే.. వర్షంలో తడవాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ తడిస్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే వస్తాయి. అందుకే వర్షాకాలానికి తగినట్టుగా మనం ఆహార జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం పాలవకుండా కాపాడుకోవచ్చు. అవేంటో చూద్దాం..
* పాలు, పాలతో తయారుచేసిన ఇతర పదార్థాలను సమయానుసారంగా మితంగా తీసుకోవాలి. ఎందుకంటే పాలతో తయారుచేసిన పదార్థాలు త్వరగా పాడవుతాయి.
* పండ్లను తినేముందు కట్ చేసుకుని తినాలి. ముందుగా కట్ చేయడం వల్ల వాటిపై కీటకాలు చేరతాయి.
* ఆకుకూరలను వినియోగించే ముందు ఒకటికి రెండుసార్లు శుభ్రం చేయడం మంచిది. లేకుంటే ఆకులపై ఉన్న కీటకాలు అనారోగ్యం కలుగజేస్తాయి.
* వానాకాలంలో నూనె అధికంగా ఉన్న ఆహారం తీసుకోకపోవడమే మంచిది.
* వీధుల్లో దొరికే తినుబండరాలకు ఈకాలంలో దూరంగా ఉండాలి.
* ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకున్న ఆహారం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అది ఈ సీజన్‌లో ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి.
* ఈ కాలంలో అధిక ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది. అలాగే పచ్చిపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఈ సీజన్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.