Others

సర్వం జగన్నాథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణ్యం చేయడం వల్ల సుఖాలు, పాపం చేయడం వల్ల దుఃఖాలు వస్తాయని పెద్దలు అంటారు. ఏదైనా కష్టాన్ని అనుభవించేవారు సాధారణంగా పూర్వజన్మలో ఎవరిని బాధపెట్టానో, ఏ పాపం చేశానో కానీ ఇపుడు అనేక కష్టాలు అనుభవిస్తున్నాను అంటుంటారు.
ఏమి పని చేసినా దానికి పుణ్యమో పాపమో కాని ఫలితాన్ని మాత్రం అనుభవించాల్సిందే. నహుషుడు అనేక అశ్వమేధయాగాలు చేసి స్వర్గలోకానికి వెళ్లి అక్కడ ఇంద్రపదవికూడా పొందాడు. కానీ దుష్టత్వంలో ప్రవర్తించగానే స్వర్గం నుంచి సరాసరి అడవిలో పాము వలె పడిపోయాడు అని పురాణాలు చెబుతున్నాయ.
పురాణాలు పాపాలు పదిరకాలు అని చెబుతాయ. వ్యాసమహర్షి మనుష్యులందరూ పుణ్యం చేయాలని, దర్మమార్గంలో నడవాలని ఎన్నో పురాణాలు, వేద విభజన చేశాడు. చివరకు ఇలా కాదని ఒక్కముక్కలో చెప్పితే అర్థం చేసుకొనేవారు ఎక్కువ ఉంటారనుకొని పరులను పీడించడమే పాపము. పరులకు హితం చేయడమే పుణ్యమూ అని చెప్పాడు.
ఇతరులను మనసా వాచాకర్మణా నిందించరాదు. అపకారం చేసినా నొచ్చుకొనక వారికి కీడు చేయకుండా తిరిగి ఉపకారం చేసి పంపడమన్నది పుణ్యాత్ములు, ఉన్నతులు చేసే పని ఒక శతకకారుడు చెబుతున్నాడు.
ఇతరులు తనకే విధంగా అనుకూలంగా ఉండాలని మనిషి అనుకొంటాడో అదేవిధంగా తాను ఇతరుల వద్ద వ్యవహరించాలన్నది సూత్రంగా పెట్టుకుంటే పాపం అంతగా చేయకుండా ఉండడానికి వీలుంటుంది. అదీకాక మనుష్యులందరిలోను. ప్రాణికోటి అంతటిలోను భగవంతుని అంశను చూడగలిగితే కీడు చేయమన్నా చేయలేరు. అందుకే పెద్దవాళ్లు మానవ సేవయే మాధవ సేవఅని అన్నారు. ఇతరులకు ఏ సేవ చేసినా అది మాధవునికి చేసినట్లే అవుతుంది. భగవాన్ సత్యసాయ తాను చేసి మరీ చూపించాడు. శిరిడీ సాయబాబా కూడా సాయం చేసి మరీ చూపించాడు.
సమదృష్టిని అలవర్చుకున్నపుడు మానవసేవ చేయడం సులభం అవుతుంది. అందరినీ, అన్నింటినీ భగవంతుని అవతారంగా చూడాలి. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఉపాసించి అమ్మ ను దర్శనం చేసుకొన్నపుడు ఆయనకు సర్వ ప్రపంచమూ కాళికాదేవి వలె అమ్మవలె కనిపించిందట. రిక్షాతొక్కు వానిగా, రిక్షాలో కూర్చుని వెళ్లేవానిగాను, అమ్మగాను, కూతురుగాను, వృద్ధురాలిగాను, పడుచువానిగా యువకుడుగాను, వృద్ధుడుగాను, ఇంకా చెప్పాలంటే రోగి కూడా అమ్మవలె కనిపించారట. ఇంతటి సమదృష్టి ఇంతటి దైవం పైన నమ్మకం కలిగి ఉంటే చాలు భగవంతునికి మనుష్యునకు వేరు భావం ఉండదు.
అందుకే అహం బ్రహ్మస్మి అన్నారు. ఎవరికి వారు భగవంతుని రూపాలే. ఎందుకంటే లోకమంతా భగవంతుని సృష్టినే కదా. సృష్టికి ఆవల కానీ ఈవల కాని ఉండేది భగవంతుడే. సృష్టినిండా ఉన్నదీ దైవమే. దైవమన్న భావంతో వ్యవహరిస్తే పాపమేమున్నది పుణ్యమేమున్నది. దీన్ని గుర్తించిన భగవద్గీత నీవు చేసే పనులన్నీ ఈశ్వరార్పణం చేసి చేయ.
కర్తవ్యాన్ని నిర్వర్తించు ఫలితం ఆశించకు. నీ యోగ క్షేమాలు భగవంతుడు చూస్తాడు అని అంది. అందుకే ఎవరు ఏది చెప్పినా పరులను హింసించకుండా పరులకు ఉన్నంతలో హితాన్ని కలుగచేస్తూ ఉండడమే భగవంతుడు నచ్చే పని పుణ్యమే కాదు మానసిక ఆనందం వచ్చే పని అవుతుంది.
సభ్యత సంప్రదాయం ఆచారాలు వ్యవహారాలు అన్నీ కాలానుగుణంగా మారవచ్చు . కానీ ధృతి, క్షమ, దమం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీః, విద్య, సత్యం అక్రోధం నేర్పే ధర్మం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఇతరులను సౌభాతృత్వంతో, స్నేహంగా చూడమనే బోధిస్తుంది. అంతరంగంలో పవిత్రభావన కలిగి ఉంటేనే ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది. దినివల్లనే ఇతరులకు స్వార్థం లేకుండా సాయం అందచేయాలనే బుద్ధి పుడుతుంది.
వీటివల్ల ఏర్పడే ఆలోచన్లు భగవంతుని రూపాన్ని, తత్వాన్ని ఎరుకపరుస్తాయ. అహింస, ప్రేమ, దయ, పరోపకారం మనిషి దివ్యునిగా మారుస్తాయ. పశుత్వం నుంచి పశుపతి తత్వం నిరూపణ చేసే దిశగా అడుగులువేస్తాడు. అపుడు భగవంతునికి మనిషికి భేదం ఉండదు. సర్వం జగన్నాథు డుగా గోచరమవుతాడు. వీటిని చెప్పేవే మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, మహర్షుల ప్రబోధాలు, ప్రాసంగికుల బోధలు అన్నీ ఇవే. కనుక అన్నింటినీ అర్థం చేసుకోలేక పోతున్నాం అనే బాధ లేకుండా ఇతరులకు ఉన్నంతలో సాయం అందిస్తూ అందరినీ స్నేహభావంతో చూడడడమే పరమోన్నతమైన విషయం.

- డా. ఎ.రాజమల్లమ్మ