Others

తుపాకీ మరమ్మతుల్లో ఘనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నింట్లోనూ మగవారితో పోటీ పడుతున్నారు నేటి మహిళలు. విమానం నడపడం దగ్గర నుంచి యుద్ధరంగంలో తుపాకీ పట్టడం వరకు దేనికీ వెనుకంజ వేయడం లేదు. అలా భిన్నమైన వృత్తిని ఎంచుకున్నారు ఇక్కడి మహిళలు. యుద్ధరంగంలో తుపాకీ మహిళలను చూసుంటాం.. కానీ సైనికుల తుపాకులకు మరమ్మతులు చేసే మహిళలను ఎప్పుడైనా చూశారా? మగవారి పనిగా భావించే ఈ వృత్తిని చేపట్టి ప్రత్యేకంగా నిలిచిన నలుగురు నేపాల్ మహిళల గురించి తెలుసుకుందాం..
నేపాల్ సైన్యంలో తుపాకులను మరమ్మతు చేసేవారిలో నలుగురి మహిళలు ఉన్నారు. వారు.. లీలాకాప్లే, హిమా పోఖ్రాల్, అస్మితా ఆచార్య, కుస్ కుమారి థాపా. ఈ నలుగురు నేపాల్ సైన్యంలో తుపాకులను మరమ్మతు చేస్తున్నారు. ఇలా చేసే మొట్టమొదటి మహిళలు వీరే. అందుకు వీరు చాలా గర్వపడుతున్నారు. ఆర్మీలో తప్ప మరెక్కడా నేర్చుకోని పని ఇది. ఈ ఉద్యోగంలో చాలా నిబద్ధత అవసరం. ఎందుకంటే తుపాకీతో కాల్చినప్పుడు తూటా కచ్చితంగా గురిపెట్టిన చోటే తగలాలి. మగవారు యుద్ధ్భూమిలో పోరాడుతున్నప్పుడు మహిళలు ఈ తుపాకులను ఎందుకు మరమ్మతు చేయకూడదని అనిపించింది. అందుకే మేం ఈ వృత్తిని ఎంచుకున్నాం. మేము కూడా పురుషులతో సమానంగా పనిచేయాలని అనుకోవడం వల్లే ఈ వృత్తిని ఎంచుకున్నాం అని చెబుతున్నారు ఈ నలుగురు మహిళలు. తొమ్మిది సంవత్సరాల కిందటే నేపాల్ సైన్యం ఈ వృత్తిలోకి మహిళలను తీసుకోవడం మొదలుపెట్టారు. సైన్యంలో శిక్షణ ప్రారంభంలో ఈ తుపాకులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఆయుధ నిర్వహణ విభాగాన్ని ఎంచుకున్నామని, అందుకనే ఈ వృత్తిలోకి వచ్చామని చెబుతున్నారు నలుగురు మహిళలు. విదేశాల్లో ఈ వృత్తిలో కొనసాగుతున్న మహిళలే మాక ఆదర్శం అని చెబుతున్నారు. సైన్యంలో పనిచేసే మహిళలు చాలామందే ఉన్నారు. కానీ తుపాకులు మరమ్మతులు చేసే మహిళలు మాత్రం ఈ నలుగురే. పురుషుల వృత్తిగా పరిగణించే ఈ పనిని వీరు అతి సమర్థవంతంగా నిర్వహించడం విశేషం. ఏది ఏమైనా పురుషులతో సమానంగా మహిళలు అన్ని వృత్తులలో కొనసాగడం అభినందనీయం.