Others

బడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడే
నమ్మకం ముక్కలై
నిజం నిగ్గుతేలింది!

అక్కడే
అర్థం పర్థం లేవనుకున్న
గీతలన్నీ
అక్షరాలై అవగతమయంది!

అక్కడే
అనుభవాలన్నీ
అభిరుచులుగా వైఖరులుగా
అభివ్యక్తమయంది!

అక్కడే
ఒంటరితనం చెక్కలై
చెలిమి చెట్టు చిగుర్లు వేసింది!

అక్కడే
‘నేను’ అనే గది తలుపులు
మూసుకొని
‘మనం’ అనే ముఖద్వారం
తెరుచుకుంది!

అక్కడే
విడివిడిగా విశిష్టతను
చాటుకున్న చేతివేళ్లన్నీ
పిడికిలిగా బిగుసుకుంది!

అక్కడే
విజ్ఞానం ముందు
అజ్ఞానం
చేతులు కట్టుకుని నిలబడింది!

అక్కడే
‘సమాజం’ అనే కొండ
‘బడి’ అనే అద్దంలో
అందంగా ఒదిగిపోతుంది

- సాంబమూర్తి లండ, 9642732008