Others
అమ్మ - నాన్న
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 July 2019
- చందలూరి నారాయణరావు
తాత అనుభవానికి
తర్జుమా మా నాన్న
మా నాన్న ప్రతి మాటకు
ముందుమాట మా అమ్మ..
చిన్నప్పుడు బట్టి పట్టిన
ఎక్కాల పుస్తకంలో అడుగున
ప్రతిరోజు పలకరించమని
పంతంపెట్టే పద్యంలా...
ప్రతి పనిలో విజయం వెంట చేరేలా
దారివెంట వేలుపట్టి నడిపించే నాన్న..
ప్రతి క్షణం కలలకు జీవం పోస్తూ
కళ్లలో పెట్టుకొని కాపలా కాసే అమ్మ
వయోభారం ఎంత బరువెక్కుతున్నా
మనోభారం రవ్వంత కనిపించనీయని
వీరిని ఏమనాలి? ఏమని పిలవాలి?
దేవుడితో సమానులని పిలిచి
అమ్మ నాన్నలను
తక్కువ చేసుకోలేను.
దేవుడి స్వరూపాలని తలచి
దేవుడిని ఎక్కువ చేయలేను